సౌదీలో ఉంటున్న ప్రవాసులకు కీలక సూచన...రెసిడెన్సీ పర్మిట్ పోతే...!!!

ఉపాది, విద్య, వ్యాపారం ఇలా ఏ రంగంలో అయినా సరే విదేశాలలో స్థిరపడాలంటే అందుకు ఆయా దేశాలు వారి దేశంలో ఉండేందుకు అనుమతిస్తున్నట్టుగా రెసిడెన్సీ పర్మిట్ ను ఇస్తాయి.వీటిని ఏడాది కి ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి.

 Saudi Arabia: Sr500 For Replacement Of Lost Residence Permit,saudi Arabia, Resid-TeluguStop.com

ఒక వేళ ఈ పర్మిట్ లు పోగొట్టుకున్నా, లేక రెన్యువల్ చేసుకోక పోయినా ఆ దేశం విధించే శిక్షలకు సిద్దంగా ఉంది తీరాల్సిందే.అయితే తాజాగా సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రవాసులకు కొన్ని కీలక సూచనలు చేసింది.

సౌదీ ఇచ్చే రెసిడెన్సీ పర్మిట్ నిభందన విషయంలో మార్పులు చేసిన ప్రభుత్వం తమ దేశంలో ఉంటున్న ప్రవాసులు తప్పనిసరిగా మారిన నిభంధనలను అనుసరించాలని సూచించింది.సహజంగా ప్రవాసులు ఎవరైనా సరే రెసిడెన్సీ పర్మిట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.

వాటిని భద్రంగా దాచుకుని మళ్ళీ రెన్యువల్ సమయంలో బయటకు తీస్తారు.అయితే దరిద్రం ఫ్రంట్ పాకెట్ లో ఉండి ఖర్మ కాలి పర్మిట్ ను పోగొట్టుకుంటే మళ్ళీ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ వివరాలనే ప్రభుత్వం సూచించింది.

Telugu Permit, Sadad System, Saudi Arabia, Visa-Telugu NRI

ప్రవాసుల రెసిడెన్సీ గడువు ఏడాది ఉన్నా లేదంటే అంతకంటే తక్కువ ఉన్నా సరే వీసా పర్మిట్ పోగొట్టుకుంటే పోగొట్టుకున్న సమయం నుంచీ అసలు కాలపరిమితి అయ్యే వరకూ రెసిడెన్సీ పర్మిట్ తీసుకోవాల్సిందే.అయితే అందుకు సుమారు రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది అది కూడా ఈ రుసుమును సదద్ సిస్టమ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.అయితే మరో సారి ఈ పర్మిట్ పొందాలంటే ప్రవాసులు తాము పనిచేస్తున్న యజమాని లేదా కంపెనీ నుంచీ లెటర్ పొందటంతో పాటు వారు అందించే అప్లికేషన్ లో పోగొట్టుకున్న ప్రాంతం, సమయం నమోదు చేయాల్సి ఉంటుంది.ఒక వేళ ముందుగానే రెసిడెన్సీ పర్మిట్ ను స్కాన్ చేసుకుని ఉండుంటే దాని జిరాక్స్ జత చేయచ్చు.ఇక పర్మిట్ పొందేందుకు రూ.10 ఖర్చు అయితే పోగొట్టుకున్న కారణానికి మరో రూ.20 వేలు అపరాధ రుసుము కింద చమురు వదిలిపోతుంది.కాబట్టి విదేశాలు వెళ్ళే ప్రతీ ప్రవాసులు ప్రధాన శిక్ష అయిన ఈ రెసిడెన్సి పర్మిట్ ను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడటం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube