శంకరాభరణం కోసం తరలి వెళ్లిన అన్నగారు !

30 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఏకచిత్రాధిపత్యం చేస్తున్న ఒక హీరో మరొక సినిమా బాగా ఆడితే మెచ్చుకునే రోజులు కావు అవి.

ఒకరిపై ఒకరికి విద్వేషాలు అలాగే హీరోలు ఎవరికి వారు వేరు వేరు కాంపౌండ్స్ మైంటైన్ చేస్తున్న రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ ఒక చిన్న సినిమా పెద్ద విజయం సాధించడంతో ఎలాంటి కల్మషం లేకుండా వచ్చి ఆ చిత్ర బృందాన్ని మెచ్చుకోవడం అంటే అప్పట్లో పెద్ద సంచలనమే.

మరి నందమూరి తారక రామారావు గారిని అంతలా కదిలించిన ఆ సినిమా ఏంటి ? ఏ కారణం చేత ఆయన ఒక చిన్న సినిమా కోసం తరలి వెళ్లాల్సి వచ్చింది అనే విషయం ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Sr Ntr Met With Shankarabharanam Team, Shankarabharanam, Sr Ntr, K Vishwanath

ఇక ఎన్టీఆర్ మనసు దోచిన ఆ చిత్రం మరేదో కాదు శంకరా భరణం.1980వ సంవత్సరంలో వచ్చిన శంకరా భరణం సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలుసు.సంగీతం ముఖ్యాంశంగా విడుదలైన ఈ సినిమా మొదట కొంత డివైడ్ టాక్ తో నడిచినప్పటికీ ఆ తర్వాత చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా విజయం సాధించింది.

ఈ సినిమాకు కే విశ్వనాథ్ దర్శకత్వం చేయగా, ఏడిద నాగేశ్వరరావు నిర్మాణం చేపట్టారు.ఈ సినిమా ఫిబ్రవరి 2, 1980వ సంవత్సరంలో విడుదల అయ్యింది.సినిమా అంటే హీరో మాత్రమే అనే స్థాయిలో అప్పట్లో సినిమాలో వస్తున్న సమయంలో కేవలం సంగీతం మాత్రమే నమ్ముకుని 60 ఏళ్ళు ఒక వృద్ధుడిని ప్రధాన పాత్రలో తీసుకుని విశ్వనాథ్ చేసిన ప్రయోగాత్మక చిత్రం ఎంతో పెద్ద విజయం సాధించి విశ్వనాథ్ నీ కళాతపస్విగా మార్చింది.

Sr Ntr Met With Shankarabharanam Team, Shankarabharanam, Sr Ntr, K Vishwanath
Advertisement
Sr Ntr Met With Shankarabharanam Team, Shankarabharanam, Sr Ntr, K Vishwanath-�

ఇక ఈ సినిమా విజయం సాధించడంలో తో సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా వెళ్లి చిత్ర బృందాన్ని మెచ్చుకోవడం జరిగింది.ఆ సమయంలో ఆయన దాదాపు 7, 8 సినిమాల్లో నటిస్తున్నారు.మరీ ముఖ్యంగా ఆ సమయంలో ఛాలెంజ్ రాముడు.

సర్కస్ రాముడు.సర్దార్ రాముడు.

రౌడీ రాముడు కొంటె కృష్ణుడు.ఆటగాడు.

సూపర్ మాన్ వంటి సినిమాల షూటింగ్స్ తో ఎంతో బిజీగా ఉన్నా కూడా శంకరా భరణం సినిమా యూనిట్ ని కలుసుకున్నారు.ఆ సమయంలో తీసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు