Spy Movie : థియేటర్లలోనే కాదు బుల్లితెరపై కూడా డిజాస్టర్.. స్పై మూవీ రేటింగ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ హీరో నిఖిల్( Nikhil Siddhartha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవల కాలంలో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు నిఖిల్.

 Spy Movie Failure Concluded With Tv Premiere-TeluguStop.com

కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఆ తర్వాత వచ్చిన స్పై సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ను చవిచూశాడు.ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ జరిపి ఆ రేంజ్ లో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ అనుకోకుండా ఈ సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది.

అలా తక్కువ ప్రచారంతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు బుల్లితెర పైకి వచ్చిన ఈ సినిమా బుల్లితెరపై కూడా ఊహించని విధంగా దారుణమైన ఫలితాలను నమోదు చేసుకుంది.ఈటీవీ స్పై మూవీ రైట్స్ ను దక్కించుకుంది.తాజాగా ఈ సినిమాను ప్రసారం చేస్తే, కేవలం 1.48 రేటింగ్ వచ్చింది.అలా స్పై కథ పరిసమాప్తమైంది.

అవాంతరాలను ఎదుర్కొని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అంతగా క్లిక్ అవ్వలేదు.అలా ఫ్లాప్ అయిన స్పై సినిమా( spy movie ), ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా ఫెయిల్ అయ్యింది.

ఇకపోతే నిఖిల్ ప్రస్తుతం స్వయంభు( Swayambhu ) అనే పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కత్తియుద్ధం, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు.ఈ సినిమాతో పాటు ఇండియన్ హౌజ్ అనే సినిమాను ఈ హీరో ఎనౌన్స్ చేశాడు నిఖిల్.మరి ఈ సినిమాలు ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి మరి.హీరో నిఖిల్ స్పై మూవీ దారుణమైన డిజాస్టర్ ను చవిచూడడంతో తదుపరి సినిమాలతో ఎలా అయిన హిట్ కొట్టాలని చూస్తున్నాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube