Spy Movie : థియేటర్లలోనే కాదు బుల్లితెరపై కూడా డిజాస్టర్.. స్పై మూవీ రేటింగ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!
TeluguStop.com
టాలీవుడ్ హీరో నిఖిల్( Nikhil Siddhartha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఇటీవల కాలంలో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు నిఖిల్.కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఆ తర్వాత వచ్చిన స్పై సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ను చవిచూశాడు.
ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ జరిపి ఆ రేంజ్ లో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ అనుకోకుండా ఈ సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది.
అలా తక్కువ ప్రచారంతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. """/" /
ఇది ఇలా ఉంటే ఇప్పుడు బుల్లితెర పైకి వచ్చిన ఈ సినిమా బుల్లితెరపై కూడా ఊహించని విధంగా దారుణమైన ఫలితాలను నమోదు చేసుకుంది.
ఈటీవీ స్పై మూవీ రైట్స్ ను దక్కించుకుంది.తాజాగా ఈ సినిమాను ప్రసారం చేస్తే, కేవలం 1.
48 రేటింగ్ వచ్చింది.అలా స్పై కథ పరిసమాప్తమైంది.
అవాంతరాలను ఎదుర్కొని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అంతగా క్లిక్ అవ్వలేదు.అలా ఫ్లాప్ అయిన స్పై సినిమా( Spy Movie ), ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా ఫెయిల్ అయ్యింది.
ఇకపోతే నిఖిల్ ప్రస్తుతం స్వయంభు( Swayambhu ) అనే పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు.
"""/" /
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కత్తియుద్ధం, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు.
ఈ సినిమాతో పాటు ఇండియన్ హౌజ్ అనే సినిమాను ఈ హీరో ఎనౌన్స్ చేశాడు నిఖిల్.
మరి ఈ సినిమాలు ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి మరి.హీరో నిఖిల్ స్పై మూవీ దారుణమైన డిజాస్టర్ ను చవిచూడడంతో తదుపరి సినిమాలతో ఎలా అయిన హిట్ కొట్టాలని చూస్తున్నాడట.