చైతన్య సమంత కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో మీకు తెలుసా?

రియల్ లైఫ్ లోనే కాదు రీల్ లైఫ్ లో కూడా చైతన్య సమంతల జోడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

పెళ్లి తర్వాత చైతన్య, సమంత కలిసి నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు విజయం సాధించాయి.

నాగచైతన్య, సమంత కలిసి నటించిన తొలి సినిమా ఏ మాయ చేశావే కాగా అటు నాగచైతన్య కెరీర్ ను, ఇటు సమంత కెరీర్ ను ఈ సినిమా మలుపు తిప్పింది.హీరో నాగచైతన్యకు ఈ సినిమాతో తొలి సక్సెస్ దక్కింది.

ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సినిమా తర్వాత అక్కినేని ఫ్యామిలీ మూవీగా మనం సినిమా తెరకెక్కింది.

పూర్వజన్మ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాలో భార్యాభర్తల పాత్రల్లో చైతన్య, సమంత జీవించారనే చెప్పాలి.మనం సినిమా షూటింగ్ సమయంలోనే చైసామ్ ల ప్రేమ బంధం మరింత బలపడిందని చాలామంది భావిస్తున్నారు.

Advertisement

ఈ సినిమాల తర్వాత చైసామ్ కాంబినేషన్ లో ఆటోనగర్ సూర్య సినిమా తెరకెక్కింది.దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా మెకానిక్ పాత్రలో నాగచైతన్య మెప్పించారు.

ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా ఈ సినిమాలోని పాటలన్నీ హిట్ కావడం గమనార్హం.పెళ్లి తర్వాత చైతన్య, సమంత కలిసి మజిలీ సినిమాలో నటించారు.శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

బాక్సాఫీస్ వద్ద మజిలీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించడం గమనార్హం.పెళ్లి తర్వాత సమంత లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో ఎక్కువగా నటించగా వీళ్లిద్దరూ కలిసి నటించిన ఓ బేబీ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.ఈ సినిమాలో నాగచైతన్య గెస్ట్ రోల్ లో నటించి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు