పూతలపట్టు నియోజకవర్గంలో ఎన్నారైలు విశేష సేవలు..

యూకే, యూరోప్‌కు చెందిన ఎన్నారైలు చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో విశేషమైన సేవలు అందిస్తున్నారు.

గత మూడేళ్లుగా సేవా కార్యక్రమాలను చేపడుతున్న వారు ఏడాది కూడా కొన్ని మండల కేంద్రాల్లో ఫిబ్రవరి 3,4,5 తేదీలలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

తెలుగుదేశం ముఖ్య నాయకులు శ్యామ సుందర్ ఊట్ల, వివేక్ కరియవుల పూతలపట్టు నియోజకవర్గంలో భారీ ఎత్తున సేవలు చేస్తున్నారు.ఎప్పటిలాగానే ఈ ఏడాది వారు టీడీపీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్నీ ఘనంగా నిర్వహించారు.

Special Services Of Tdp Nri Leaders In Puthalapattu Constituency Details, Nri Ne

యూకే, యూరోప్‌కు చెందిన ఎన్నారైలు పూతలపట్టు నియోజకవర్గంలో కొన్ని మండల కేంద్రాల్లో ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీ పార్టీ వాలంటీర్స్‌కి ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.నగరి నియోజకవర్గంలో భారీ ఎత్తున చేపట్టిన సేవా కార్యక్రమాలలో కూడా పాలుపంచుకున్నాడు.టీడీపీ పార్టీ కోరిక మేరకు తిల్లీ తుఫాన్ సమయంలో వీరు ఉక్రెయిన్‌లోని బాధితుల కోసం సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఫారెన్ దేశాల్లో చదువుకొని ఇండియాకి తిరిగి వచ్చిన స్టూడెంట్స్‌కి తమకు చేతనైనంత సహాయం చేసి ఉద్యోగాలను కూడా ఇప్పించారు.

Special Services Of Tdp Nri Leaders In Puthalapattu Constituency Details, Nri Ne
Advertisement
Special Services Of TDP NRI Leaders In Puthalapattu Constituency Details, NRI Ne

ఇకపోతే యూకేలో టీడీపీ కార్యకర్తలకు సోషల్ మీడియాలో పార్టీ అభివృద్ధి కోసం నినాదాలు చేసేలా ట్రైనింగ్ ఇస్తున్నారు.తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి వారికి హెల్ప్ అవుతున్నారు.ఇకపోతే నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్రకు పూర్తి సపోర్ట్‌ను ప్రకటించారు.

ఈ ఎన్నారైలు 400 రోజుల పాదయాత్రలో కొన్ని నియోజకవర్గాలలో సేవ కార్యక్రమాలు చేపట్టనున్నారు.డా.

కిషోర్ బాబు చలసాని, కృష్ణ వల్లూరి, శ్రీనివాస్ గోగినేని, కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, అమర్నాథ్ పొట్లూరి, వెంకటపతి తదితర భారత ప్రవాసులు ఈ కార్యక్రమాలలో పాలు పంచుకొనున్నారు.

స్టామినా పెంచే ఆహారాల గురించి తెలుసుకుందాం
Advertisement

తాజా వార్తలు