పట్టణ సుందరీ కరణకు ప్రత్యేక ప్రణాళిక:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:మున్సిపల్ పరిధిలోని చేపట్టిన అన్ని పనులను మే మాసంతానికి పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో పట్టణంలోని మున్సిపల్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ ఎస్.

వెంకట్రావ్,వైస్ చైర్మన్ వైటిడిఏ,రిటైర్డ్ ఐఏఎస్ కిషన్ రావుతో కలసి సమీక్షించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ సుందరీ కరణలో భాగంగా ఎక్కడ కూడా పనులలో అధికారులు రాజీ పడవద్దని అధికారులను మంత్రి ఆదేశించారు.

పట్టణాల సుందరీకరణలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు.సద్దుల చెరువు వద్ద గల 5 ఎకరాలలో అన్ని మౌలిక వసతులతో ఫుడ్ కోర్ట్, బోటింగ్,ప్రజలకు వినోదాన్ని పంచే విధంగా సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

అట్టి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు వారంలో సిద్ధం చేసి పంపాలని మంత్రి ఆదేశించారు.ఇప్పటికే పట్టణంలో పి.ఎస్.ఆర్ సెంటర్, రాఘవ ప్లాజా వద్ద జంక్షన్ ల పనులు పురోగతిలో ఉన్నాయని,వారంలో పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు.అలాగే ఎన్టీఆర్ పార్క్ వద్ద గల జంక్షన్ పనులు త్వరగా పూర్తగి చేయాలని ఆదేశించారు.

Advertisement

పుల్లారెడ్డి, దురాజ్ పల్లి చెరువులను ట్యాంక్ బ్యాండ్ లుగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం గూగుల్ మ్యాప్ ద్వారా సద్దుల చెరువును పరిశీలించి మున్సిపల్, రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్,ఎస్.మోహన్ రావు, డి.ఆర్.ఓ రాజేంద్రకుమార్, మున్సిపల్ కమిషనర్ రామనుజులరెడ్డి,ఈఈ నీటిపారుదల జగ్గు నాయక్,తహసీల్దార్ వెంకన్న అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు