మునుగోడులో కాంగ్రెస్ హైక‌మాండ్ స్పెష‌ల్ ఫోక‌స్.. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి షాక్...!

తెలంగాణ రాష్ట్రంలో బై పోల్ ర‌చ్చ మొద‌లైంది.ఉప ఎన్నిక అంటే రాష్ట్రం ఫోక‌స్ మొత్తం అక్క‌డే ఉంటుంది.

అన్ని పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటాయి.కోట్లు కుమ్మ‌రిస్తూ నెగ్గ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

ఇక అధికార పార్టీ నిధులు కుమ్మ‌రించి అభివృద్ది అంటూ హడావుడి చేస్తుంది.ఇప్పుడు కూడా మునుగోడులో అదే జ‌రిగేలా ఉంది.

నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామాను ప్రకటించి ఊహాగానాల‌కు తెర‌దించారు.త్వరలో స్పీకర్ ను కలిసి ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా లెట‌ర్ అంద‌జేస్తాన‌ని వెల్లడించారు.

Advertisement
Special Focus Of Congress High Command In Munugodu Komati Reddy Venkat Reddy Is

దీంతో కాంగ్రెస్ కంచుకోట‌గా చెప్పుకుంటున్న న‌ల్ల‌గొండ‌లో భారీ షాక్ త‌గిలిన‌ట్లైంది.అయితే ఏ పార్టీలో చేర‌తారో ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ బీజేపీలో చేర‌డం ఖ‌య‌మ‌నే విష‌యం తెలిసిందే.

దీంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది.అయితే ఎప్పుడు ఎన్నికలు వ‌చ్చినా తామే అధికారంలోకి వస్తామంటూ చెప్పుకుంటున్న ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికను స‌వాలుగా తీసుకుంటున్నాయి.

రాజ‌గోపాల్ రెడ్డి అమిత్ షాను క‌లిసిన‌ప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టారు.వ్యూహాలు ర‌చిస్తూ పావులు క‌దుపుతున్నారు.

ఇక ఈ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలోకి దిగడం ఖాయమే అనిపిస్తోంది.అయితే మునుగోడును కాషాయ‌మ‌యం చేసి వచ్చే ఎన్నికల్లో త‌మ‌దే అధికారం అని సంకేతాలు ఇవ్వాలని ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది.

Special Focus Of Congress High Command In Munugodu Komati Reddy Venkat Reddy Is
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

బీజేపీ దూకుడుని కంట్రోల్ చేయాల‌ని.

ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ రాజ‌గోపాల్ ని ఓడించి బీజేపీ కంట్రోల్ చేయాల‌ని.ప్ర‌జాధ‌ర‌ణ త‌గ్గ‌లేద‌ని చెప్పుకుని మరోసారి అధికారం ద‌క్కించుకోవాల‌ని భావిస్తోంది.

Advertisement

అయితే.ఇక కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక చావో రేవో తెల్చేద‌ని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఈ ఎన్నికల్లో నెగ్గ‌కుండా.పైగా మూడో స్థానంలో గానీ నిలిచిందంటే.

ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడి పార్టీ ప‌రిస్థితిని దారుణంగా దెబ్బతీస్తుంద‌ని అంటున్నారు.ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ హైక‌మాండ్ కూడా మునుగోడుపై స్పెష‌ల్ ఫో కస్ పెంచింది.

రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ప్రకటించిన వెంటనే నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాటజీ అండ్ క్యాంపేయిన్ కమిటీని ప్రకటించ‌డం విశేషం.

మధుయాష్కి గౌడ్ కన్వీనర్ గా.

ఈ కమిటీలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల‌ను భాగం చేసింది.కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మధుయాష్కి గౌడ్ ను కన్వీనర్ గా నియమించింది.

కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, అనిల్ కుమార్ ను ప్ర‌క‌టించింది.కాగా ఈ క‌మిటీలో వెంక‌ట్ రెడ్డికి చోటు క‌ల్పించ‌కుండా హైక‌మాండ్ షాక్ ఇచ్చింది.

వెంక‌ట్ రెడ్డికి చోటు ద‌క్క‌క‌పోవ‌డం.

అయితే ఈ క‌మిటీలో రాజగోపాల్ రెడ్డి అన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు కల్పించక‌పోవ‌డం విశేషం.వెంకట్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి ఎంపీ స్థానం పరిధిలోకే మునుగోడు నియోజకవర్గం కూడా వస్తుంది.

దీంతో స్థానిక ఎంపీకి కమిటీలో ప్రాతినిథ్యం ఇవ్వకపోవడంపై చ‌ర్చ జ‌రుగుతోంది.అధిష్టానం కావాలనే పక్కనపెట్టిందా.? లేదా మరేదైనా బాధ్యతలను అప్పగిస్తుందా.? అనేది తెలియాల్సి ఉంది.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం వెంకట్ రెడ్డి కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేస్తార‌ని ప్ర‌క‌టించారు.

తాజా వార్తలు