పల్నాడు జిల్లా: ఎస్పీ రవి శంకర్ రెడ్డి కామెంట్స్.వెల్దుర్తికి సంబంధించిన ఫ్యాక్షన్ నేరచరిత్ర కలిగిన వ్యక్తులు మాచర్ల పట్టణంలో నివసిస్తున్నారని ముందస్తు చర్యలల్లో భాగంగా ఈరోజు ఉదయం నుండే అక్కడ కార్డెన్ సర్చ్ నిర్వహించడం జరిగింది.
సాయంత్రం జరిగిన ఇదేమి కర్మరా బాబు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ ఫ్యాక్షన్ నేరచరిత్ర కలిగిన వ్యక్తులే ఉద్దేశం పూర్వకంగా సమీప ప్రత్యర్థులపై రాళ్లతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.
పూర్తిగా ఫ్యాక్షన్ కు సంబంధించిన గొడవకు రాజకీయరంగు పులిమే ప్రయత్నం చేస్తూ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడ్డారు.గత 20 నుండి 30 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్షన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.దాడులకు పాల్పడిన వాళ్లందర్నీ అదుపులోకి తీసుకుంటున్నాము ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది.
మాచర్ల సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.