సీనియర్ ఎన్టీఆర్ నటుడిగా ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.వివాదాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడే ఎన్టీఆర్ తను నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా నిర్మాతలు నష్టపోకుండా ఉండటానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకునేవారు.
సీనియర్ ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం 1985 సంవత్సరంలో క్యాన్సర్ బారిన పడి మృతి చెందారనే సంగతి తెలిసిందే.
బసవతారకం క్యాన్సర్ తో మృతి చెందడంతో కలత చెందిన సీనియర్ ఎన్టీఆర్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ను మొదలుపెట్టారు.500 పడకలతో 1500 మంది సిబ్బందితో ఉన్న ఈ ఆస్పత్రి రెండున్నర లక్షల కంటే ఎక్కువమంది క్యాన్సర్ బాధితులకు ఉన్నత స్థాయిలో వైద్య చికిత్సను అందిస్తుండటం గమనార్హం.బసవతారం చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ కృష్ణకుమారిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని వార్తలు వైరల్ అయ్యాయి.
సినిమా షూటింగ్ ల సమయంలో వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
షావుకారు జానకి ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కృష్ణకుమారి ప్రేమ, పెళ్లి వార్తల గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.రామారావుగారితో కృష్ణకుమారికి పెళ్లి జరిగి ఉంటే నా చెల్లెలి జీవితానికి అంత శ్రేయస్కరం కాదేమో అని షావుకారు జానకి వెల్లడించారు.
అయితే ఎన్టీఆర్ కృష్ణకుమారి విడిపోయారో గొడవ పడ్డారో అని తనకు అనిపించలేదని షావుకారు జానకి తెలిపారు.కృష్ణకుమారి ఒక్క ఫోన్ కాల్ వల్ల 17 ఫోన్ కాల్స్ ను క్యాన్సిల్ చేసుకున్నారని షావుకారు జానకి చెప్పుకొచ్చారు.ఆ తర్వాత కృష్ణకుమారి అజయ్ మోహన్ కైఠాన్ ను వివాహం చేసుకున్నారని షావుకారు జానకి వెల్లడించారు.
నా లిమిటేషన్స్ నాకు తెలుసని షావుకారు జానకి తెలిపారు.సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ నవ్వుతూ సెట్స్ లో ఉండేవారని ఆమె తెలిపారు.
ఎన్టీఆర్ కు ఎన్టీఆరే సాటి అని ఆమె చెప్పుకొచ్చారు.