ఈ మధ్య కాలంలో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు వేర్వేరు వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ప్రముఖ సినీ నటి ప్రవీణ తాజాగా పోలీసులను ఆశ్రయించడం గమనార్హం.
గతంలో ఒక వ్యక్తి తనను టార్గెట్ చేశాడని ప్రస్తుతం అదే వ్యక్తి తన కూతురిని కూడా టార్గెట్ చేశాడని ప్రవీణ చెప్పుకొచ్చారు.ఢిల్లీకి చెందిన భాగ్యరాజ్ అనే విద్యార్థి తనను వేధిస్తున్నారని ప్రవీణ కామెంట్లు చేశారు.
ప్రవీణ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఈ విద్యార్థి గతంలో సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయగా ప్రవీణ పోలీసులను ఆశ్రయించి ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేయడం జరిగింది.కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన భాగ్యరాజ్ ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.
అయితే బెయిల్ పై బయటకు వచ్చిన భాగ్యరాజ్ ప్రవీణతో పాటు ప్రవీణ కూతురిని కూడా టార్గెట్ చేసి వేధించడం గమనార్హం.
భాగ్యరాజ్ ప్రవీణ కూతురి ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వాటిని షేర్ చేశాడు.
ఈ విషయం ప్రవీణ దృష్టికి రావడంతో ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించి అతనిపై ఫిర్యాదు చేశారు.భాగ్యరాజ్ తన స్నేహితులను, బంధువులను కూడా ఇబ్బంది పెడుతున్నాడని ప్రవీణ చెబుతున్నారు.
తన పేరుపై 100 ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి భాగ్యరాజ్ ఫోటోలను వైరల్ చేస్తున్నాడని ప్రవీణ తెలిపారు.
ప్రవీణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని బోగట్టా.మార్ఫింగ్ ఫోటోలను వైరల్ చేసేవాళ్లను కఠినంగా శిక్షించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహిళలను వేధించే వాళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాల అమలు దిశగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.
భాగ్యరాజ్ విషయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.