సౌత్ లో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు.కానీ అందరిలో కొంత మంది మాత్రమే టాప్ ప్లేస్ లో ఉన్నారు.
మరి అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ లలో టాప్ లో ఉన్న ముగ్గురు ఒకే చోట కనిపించారు.మాములుగా టాప్ ప్లేస్ లో ఉండాలని అందరు ఆరాట పడుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఏ రంగంలో వారికైనా పోటీ అనేది సహజమే.కానీ ఈ పోటీ ని కేవలం పోటీగానే చూడాలి.
కానీ వ్యక్తిగతంగా కాదు.మరి ఇప్పుడు ఈ ముగ్గురు టాప్ డైరెక్టర్లు ఒకే చోట కలిసి స్నేహభావంగా ఉన్నారు.
కేవలం తమ వృత్తి పరంగానే వారు పోటీ పడుతున్నారు కానీ బయట కాదు అని నిరూపించారు.మరి ఆ ముగ్గురు సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు అని ఆలోచిస్తున్నారా.
వారే ఎస్ ఎస్ థమన్, అనిరుద్ రవిచంద్రన్, యువన్ శంకర్ రాజా.ఈ ముగ్గురు ఒకే చోట కలిసి కనిపించారు.ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.మరి ఈ ముగ్గురు రేర్ కలియిక మీడియాలో వైరల్ అయ్యింది. థమన్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.అసలు ఈ ముగ్గురు కలవడానికి కారణం ఏంటంటే.

నిన్న డైరెక్టర్ శంకర్ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన పార్టీలో ఈ ముగ్గురు కలిసారని.అదే ఫోటో బయట పడినట్టు తెలుస్తుంది.ఇక ఈ పార్టీలో డ్యాన్స్ కూడా చేసాం అని థమన్ చెప్పుకొచ్చాడు.ఏది ఏమైనా ఈ ముగ్గురు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లుగా కొనసాగుతున్నారు.
వీరి మ్యూజిక్ కారణంగానే సినిమాలు సగం హిట్ అవుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.







