26 ఏళ్లకే చనిపోయిన నటి.. సీక్రెట్ గా అంత్యక్రియలు!

దక్షిణ కొరియా ప్రముఖ నటి సాంగ్ యూ జంగ్ ఇటీవలే మృతి చెందారు.26 ఏళ్లు ఉన్న ఈ నటి అతి చిన్న వయసులో చనిపోవడంతో అందరిని షాక్ కు గురి చేసింది.

ఇదిలా ఉంటే దక్షిణ కొరియాలో నటించే సినీ తారలు చాలా వరకు 30 ఏళ్ళ లోపే చనిపోయారని తెలిపారు.

ఇలా జరగడానికి ఏదైనా కారణం ఉందా అంటూ పలువురు లు ప్రశ్నిస్తున్నారు.అది కూడా సినీ పరిశ్రమకు సంబంధించిన నటీనటులు అయ్యేసరికి అందరిలో ఆలోచనలు వస్తున్నాయి.

దక్షిణ కొరియా ప్రముఖ నటి మోడల్ గా, సినీ నటి గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి.మొదట తను మోడలింగ్ లో ఎస్టీ లాడర్ తన కెరీర్ ను ప్రారంభించి ఫ్యాషన్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.తర్వాత సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది.

ఈమె 2013 లో విడుదలయిన ఎంబీసీ వారి గోల్డెన్ రెయిన్ బో చిత్రంలో మొదటి సారి గా నటించింది.ఈ సినిమా తనకు మంచి గుర్తింపు తీసుకురాగా 2014లో మేక్ యువర్ విష్, 2017 లో స్కూల్ వంటి డ్రామా చిత్రాలలో నటించింది.

Advertisement

కొన్ని పాపులర్ మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించగా గుడ్ బై రోడ్, కే పాప్ బ్యాడ్ వంటి వీడియోలను చేసి పాప ఐకాన్ గుర్తింపు తెచ్చుకుంది.సోమవారం నాడు తన అంత్యక్రియలు నిర్వహించారని నటి మేనేజ్మెంట్ ఏజెన్సీ అయినా సబ్ లైమ్ ఆర్టిస్ట్ ప్రకటన విడుదల చేసింది.

కాగా తన అంత్యక్రియలు వారి కుటుంబ సభ్యుల మధ్య నిశ్శబ్దంగా జరిగాయని తెలిపారు.ఇక ఆమె మరణానికి కారణం ఇంకా తెలియరాలేదు.

గతంలో చా ఇన్ హా,గూ హారా,గాయకుడు సల్లీ వీళ్లంతా 30 ఏళ్లలోపు వయసు లోనే మృతి చెందారు.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు