అవును, మీరు విన్నది నిజమే.దక్షిణ కొరియా( South Korea ) ప్రజల వయసు నానాటికీ తగ్గిపోతోంది.
ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఆ దేశ ప్రజల వయసు మైనస్ కావడం గమనార్హం.అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? ఇపుడు సంప్రదాయ వయసు లెక్కింపు పద్ధతులకు గుడ్‌బై చెప్పింది దక్షిణ కొరియా.అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వయసును లెక్కించడం ఆ దేశం స్టార్ట్ చేసింది.దీంతో ఆ దేశ ప్రజల వ్యక్తిగత వయసు తగ్గినట్లు గుసగుసలు వినబడుతున్నాయి.సాధారణంగా దక్షిణ కొరియాలో 2 రకాలుగా వయసును లెక్కిస్తుంటారు. శిశువు పుట్టిన నాడే ఒక ఏడాది పూర్తి అయినట్లు వాళ్లు లెక్కిస్తారు.
అంటే గర్భం దాల్చిన సమయం నుంచే వయసును లెక్కిస్తారన్నమాట.

మరో రకమైన పద్ధతిలో.శిశువు ఎప్పుడు పుట్టినప్పటికీ జనవరి ఒకటో తేదీనాటికి వారికి ఒక ఏడాది పూర్తయినట్టు గుర్తిస్తారు.అంటే ఇక్కడ పుట్టిన రోజును ఆ దేశస్థులు పరిగణలోకి తీసుకోరని తెలుస్తోంది.
అయితే, ఆ పురాతన సంప్రదాయాలకు దక్షిణ కొరియా ఇపుడు ఫుల్‌స్టాప్ పెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం ( Wednesday )నుంచి వయసును లెక్కించే అంశంలో కొత్త విధానాన్ని అమలు చేయనున్నది.
అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లే వయసు లెక్కింపు ఉంటుందని అధికారులు చెప్పారు.

ఇకపోతే పాత విధానాలను మార్చేందుకు అధ్యక్షుడు యూన్ సుక్ యోల్( Yoon Suk Yeol ) తీవ్రంగా యత్నించారు.సంప్రదాయ పద్ధతుల వల్ల అనవసరమైన సామాజిక, ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.కొరియన్ ఏజ్ వ్యవస్థ ప్రకారం.
పుట్టిన శిశువు ఒక సంవత్సరం ఉంటుంది, ఆ తర్వాత జనవరి ఒకటో తేదీ రాగానే ఆ శిశువుకు మరో ఏడాది పూర్తవుతుంది.అంటే ఒకవేళ డిసెంబర్ 31వ తేదీన బేబీ పుడితే, అప్పుడు తెల్లారితే ఆ బేబీకి రెండేళ్లు నిండినట్లు అవుతుందని కొరియా అధికారులు చెబుతున్నారు.
వయసును లెక్కించే విధానంలో మార్పు తేవాలని నలుగురిలో ముగ్గురు కొరియన్లు కోరుకోగా అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన రీతిలో వయసు లెక్కింపు విధానం ఉండాలని స్థానిక హంకూక్ రీసర్చ్ సంస్థ తన సర్వే ద్వారా తేల్చింది.