క్రియేటివ్ డైరెక్టర్ గా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు కృష్ణ వంశీ…ఈయన చేసిన సినిమాలు సక్సెస్ లను అందుకోవడమే కాకుండా, ఈయన్ని క్రియేటివ్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం గుర్తించింది.ఇక ఆయన చేసిన సినిమాల్లో వైవిధ్యాన్ని కనబరిచడమే కాకుండా ఆ సినిమా మూడ్ ను ఎక్కడ చెడగొట్టకుండ చాలా బాగా డీల్ చేస్తాడు.
అందుకే ఈయన సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు.ఒకప్పుడు నాగార్జునతో నిన్నే పెళ్ళాడుతా( ninne pelladata ) అనే ఒక డీసెంట్ సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించిన కృష్ణవంశీ.

ఆ తర్వాత చేసిన సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకున్నాడు.ముఖ్యంగా కృష్ణవంశీ ఒక జానర్ అని లేకుండా అన్ని జానర్లలో సినిమాలు చేస్తూ ఒక్కొక్క జానర్ లో తన సత్తాను చాటుకుంటూ వస్తున్నాడు… ఇక ముఖ్యంగా ప్రకాష్ రాజ్, సౌందర్య( Prakash Raj, Soundarya ) ముఖ్య పాత్రల్లో వచ్చిన అంతఃపురం సినిమా( Antharpuram movie ) సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ప్రకాష్ రాజ్ యాక్టింగ్ కి చాలా అవార్డులు కూడా వచ్చాయి.కృష్ణవంశీ సినిమాలకి మిగతా వాళ్ళ సినిమాలకి తేడా ఏంటంటే ఈయన సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లోనే నటిస్తుంది.ఇక మిగతా వాళ్ళ సినిమాల్లో డైరెక్టర్ ఎలా చెప్తే అలా అంటే డైరెక్టర్ బాడీ లాంగ్వేజ్ అన్ని క్యారెక్టర్ల మీద రుద్ద బడుతుంది.
కానీ ఈయన సినిమాలో అలా కాదు పలానా ఓబుల్ రెడ్డి అంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆర్టిస్ట్ ని ఆ క్యారెక్టర్ లోకి తీసుకెళ్తాడు.

అందుకే ప్రతి ఆర్టిస్టు ఈయన సినిమాలో నటించడానికి చాలా ఇష్టపడతాడు.నటులు ఎవరైనా ఒక్కసారి ఈయన సినిమాలో నటిస్తే మంచి గుర్తింపు సంపాదించుకుంటారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇదిలా ఉంటే అంతఃపురం సినిమాలో ఒక సీన్ లో ప్రకాష్ రాజ్, సౌందర్యని కొడతాడు.
అందులో కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ తో నిజంగానే సౌందర్యాని కొట్టించాడు.దాంతో ఫీలైన సౌందర్య సెట్ నుంచి వెళ్ళిపోయింది.
ఇక మళ్ళీ కృష్ణవంశీ వెళ్లి కన్విన్స్ చేసి సీన్ నాచురల్ గా లేదని నేనే అలా కొట్టమన్నాను అని చెప్పడంతో సౌందర్య వచ్చి నటించింది.కానీ మొత్తానికైతే సీన్ చాలా న్యాచురల్ గా వచ్చింది.
ఇక సినిమా చూసిన తర్వాత సౌందర్య కూడా కృష్ణవంశీ గారి టాలెంట్ ని మెచ్చుకుంది…
.