మ‌ద్యం తాగేందుకు డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని క‌సాయి కొడుకు క‌ర్క‌శం...త‌ల్లిని ఏంచేశాడంటే ?

న‌వ‌మోసాలు మోసింది.కాయాక‌ష్టం చేసి పెంచి పెద్ద చేసింది.

కంటికి రెప్ప‌లా చూసుకుంది.తాను తిన్నా తిన్నాకున్నా అన్నీ తానై చూసుకుంది.

Son Is Angry That He Was Not Given Money To Drink Alcohol What Did He Do To His

తాను ప‌స్తులున్నా బిడ్డ క‌డుపు నిండితే చాలు అనుకుంది.బిడ్డ కోసం స‌ర్వం ఒడ్డి అన్నీ త్యాగాలు చేసింది.

ఈక్ర‌మంలో ఆమె వృద్ధాప్య ద‌శ‌కు వ‌చ్చింది.ఇలాంటి ప‌రిస్థితుల్లో అమ్మ ఆల‌నా పాల‌నా చూసుకోవాలి.

Advertisement

కానీ, ఆ కిరాత‌క కొడుకు ఆమె పాలిట య‌ముడిలా మారాడు.వ్య‌స‌నాల‌కు బానిసై జులాయిగా తిరుగుతూ కాలం వెళ్ల‌ దీసాడు.

ఉన్న పొలాన్ని సైతం అమ్మేశాడు.త‌న జ‌ల్సాల కోసం ఉన్న‌దంతా  ఊడ్చేశాడు.

చివ‌రికి ఇంకా డ‌బ్బులు కావాలంటూ త‌ల్లి ఇవ్వ‌లేదు.దీంతో కోపోద్రిక్తుడైన కొడుకు త‌ల్లిపై గ‌డ్డ‌పార‌తో విచ‌క్ష‌ణంగా దాడి చేశాడు.

కాగా ఈ ఘ‌ట‌న‌లో ఆమె అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది.ఈ ఘ‌ట‌న ఏపీ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండ‌లం డేవిస్‌పేట గ్రామంలో జ‌రిగింది.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

అస‌లు ఎలా జ‌రిగిందంటే.డేవిస్‌పేట గ్రామానికి చెందిన నెల్లూరు సుబ్బ‌మ్మ వృద్ధురాలు.

Advertisement

కుమారుడు క‌న్న‌య్య‌తో క‌లిసి నివాస‌ముంటోంది.కాగా వీరికి మూడున్న‌ర ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి ఉంది.

కాగా క‌న్న‌య్య వ్య‌స‌నాల‌కు బానిస‌య్యాడు.ఇలా మ‌ద్యం తాగితాగి అప్పుల‌పాల‌య్యాడు.

ఇంత‌టితో ఆగ‌కుండా నిత్యం డ‌బ్బులు ఇవ్వాలంటూ త‌ల్లిని వేధించ‌సాగాడు.ఈక్ర‌మంలోనే ఆమె రెండు ఎక‌రాలు తాక‌ట్టు పెట్టి డ‌బ్బులు ఇచ్చింది.

అయినా కొడుకు తీరు మార‌లేదు.మ‌ళ్లీ మ‌ళ్లీ డ‌బ్బులు కావాలంటూ వేధింపులు ఎక్కువ చేశాడు.

దీంతో ఆమె డ‌బ్బులు ఇచ్చేందుకు నిరాక‌రించింది.దీంతో క‌న్న‌య్య కోపంతో గ‌డ్డ‌పార తీసుకుని త‌ల్లి త‌ల‌పై బ‌లంగా బాద‌డంతో అక్క‌డిక‌క్క‌డే ఆమె మ‌ర‌ణించింది.

విష‌యం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్క‌డికి చేరుకున్నారు.వివ‌రాలు సేక‌రించి మృత‌దేహాన్ని ప‌రిశీలించారు.

కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

" autoplay>

తాజా వార్తలు