ప్రస్తుత కాలంలో సమాజం ఎటు పోతుందో తెలియడం లేదు.వివాహేతర సంబంధం పెట్టుకోవడంలో వయసు తో సంబంధం లేదు.
ఆకర్షణకు చిన్న, పెద్ద తేడా కానీ వావి వరసలు అనేవి ఏమీ లేవు.ఇంకా ఇటువంటి అక్రమ సంబంధాలకే కట్టుబడి కుటుంబ సభ్యుల పట్ల దారుణంగా ప్రవర్తించి, కుటుంబాలను రోడ్డుపై పడేసే వ్యక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతుంది.సరిగ్గా ఇలాంటి కోవకే చెందిన ఒక సంఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది.21 ఏళ్ల అబ్బాయి, పదో తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లల తల్లి (39) తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.దీనిపై తండ్రి హెచ్చరించడంతో, తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ బాబు అనే వ్యక్తి హోంగార్డుగా నిధులు నిర్వర్తిస్తూ గాంధీ రోడ్డులో నివాసం ఉంటున్నాడు.ఢిల్లీ బాబు కుమారుడు భరత్ (21) ఎటువంటి పని చేయకుండా, తల్లితండ్రుల మాట వినకుండా జులాయిగా తిరుగుతున్నాడు.ఈ క్రమంలోనే 39 ఏళ్ల ఓ మహిళతో సన్నిహితంగా ఉంటూ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
ఈ విషయం ఢిల్లీ బాబు తెలియడంతో కుమారుడిని అనేకసార్లు హెచ్చరించాడు.

ఈ విషయంపై తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు పెరిగాయి.ఆదివారం తండ్రి ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో భరత్ ఆ మహిళకు వీడియో కాల్ చేశాడు.తన తండ్రిపై చింతకట్టెతో తీవ్రంగా దాడి చేస్తూ, ఆ సన్నివేశాన్ని అంతా వీడియో కాల్ ద్వారా ఆంటీకి చూపించాడు.
ఢిల్లీ బాబు తలకు బలంగా కర్ర తగలడంతో తీవ్రంగా గాయాలయ్యాయి.గాయపడిన ఢిల్లీ బాబు ను కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చిత్తూరు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







