Anil Ravipudi: కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేశారు.. అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్!

తెలుగు చిత్ర పరిశ్రమకు పటాస్ సినిమా ద్వారా పరిచయమయ్యి వరస సినిమాలకు దర్శకత్వం వహిస్తూ అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు పొందారు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.ఇప్పటివరకు ఈయన చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అనేది జరగలేదు.

 Some Have Targeted Me Anil Ravipudi Shocking Comments Details, ,anil Ravipudi, D-TeluguStop.com

ఇలావరుస హిట్ సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి ఈయన త్వరలోనే బాలకృష్ణ సినిమాతో బిజీ కానున్నారు.తాజాగా f3 సినిమాతో మంచి హిట్ అందుకున్న అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం బాలకృష్ణతో చేయడానికి అన్ని పనులను సిద్ధం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో తనను కావాలని కొందరు టార్గెట్ చేసి తన పట్ల నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనిల్ రావిపూడి చేసినటువంటి ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీలో కొందరు పని కట్టుకొని తన సినిమాని కొనుగోలు చేసిన బయర్లు పెద్ద ఎత్తున నష్టపోయారంటూ వార్తలు సృష్టిస్తున్నారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Tollywood-Movie

ఇప్పటివరకు తాను దర్శకత్వం వహించిన ఏ సినిమా ద్వారా కూడా నిర్మాతలకు బయ్యర్లకు ఎలాంటి నష్టం రాలేదని అయితే వరుస హిట్ సినిమాలను అందుకోవటం వల్లే తన గురించి కొందరు జలసిగా ఫీల్ అయ్యి ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారంటూ ఈ సందర్భంగా అనిల్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తనకు ఎప్పటికీ కామెడీ జోనర్ అంటేనే ఇష్టమని అయితే మొదటిసారి బాలయ్య కోసం తన జానర్ కాస్త డిఫరెంట్ గా ఉండబోతుందంటూ అనిల్ రావిపూడి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.అనిల్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఈయనని ఇండస్ట్రీలో టార్గెట్ చేస్తున్నది ఎవరు అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube