గుంటూరులో జరిగిన ఓ పత్రిక సమావేశంలో బిజెపి నేత సోమవీర్రాజు మాట్లాడుతూ రాజధాని గ్రామాల్లో అమృత,విట్ ఎస్ఎంఆర్,వర్సిటీలు ఉన్నాయి దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఈ వర్సిటీల్లో అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఎక్కడెక్కడ నుంచో వచ్చి చదువుకుంటూ ఉంటారు వారందరికీ మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అలాగే 11 కిలోమీటర్లు ఉన్న రోడ్డును అభివృద్ధి చేయాలి యూనివర్సిటీల పేర్లు పై కక్షపూరితంగా వ్యవహరించకూడదు పాలన వికేంద్రీకరణ అంటే జగన్ కు అర్థం తెలుసా అసలు? విశాఖ అభివృద్ధికి కేంద్రం వేల కోట్లు నిధులు ఇచ్చింది, విశాఖకు జగన్ ప్రభుత్వం చేసింది ఏమి లేదు ప్రజలను మాత్రం మభ్యపెడుతున్నారు అంటూ బిజెపి నేత సోమ వీర్రాజు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.