రైలు పట్టాలపై సోలార్‌ ప్యానెళ్లట... అదెలాగంటే?

రైలు పట్టాలపై సోలార్‌ ( Solar on Rails )ప్యానెళ్లమేమిటి అని ఆలోచిస్తున్నారా? విషయం తెలియాలంటే ఈ పూర్తి కధనాన్ని చదవండి.ఈ మధ్య కాలంలో చూసుకుంటే సోలార్ ప్యానెల్స్( Solar panels ) సహాయంతో ఎంతోమంది ఇన్వెర్టర్లు, మోటార్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు.

 Solar Panels On Railway Tracks So What ,solar Panel, Railways, Railway Track, So-TeluguStop.com

ఈ క్రమంలోనే చాలామంది సోలార్ ప్యానెల్స్ వినియోగాన్ని వివిధ రంగాలలో వాడడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు.ఎందుకంటే, వీటివలన విద్యుత్ ఖర్చుని విపరీతంగా ఆదాచేయవచ్చు.

అయితే అదే సోలార్ ప్యానళ్లు రైలు పట్టాలపై ఎలా ఏర్పాటు చేస్తున్నారు అనే విషయం తెలియాలంటే మీరు స్విట్జర్లాండ్‌( Switzerland ) వెళ్లాల్సిందే.

రైలు ప్రయాణానికి రైలు మార్గంలో రెండు పట్టాలు మాత్రమే ఉంటాయి.అయితే ఆ రైలు వెళ్లే మార్గంలో చాలా స్థలాన్ని కేటాయిస్తూ వుంటారు.స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ ఆ స్థలాన్ని కూడా వినియోగించేలా సౌర ఫలకలను రూపొందించింది.

ఈ సోలార్‌ ప్యానెళ్లను 2 పట్టాలకు మధ్య అమర్చుతారు.దీనివల్ల రైలు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు.

అదేవిధంగా వాటి మధ్య అమర్చిన సోలార్ ప్యానెళ్లకు కూడా ఏం కాదు.వాటిని కావాల్సినప్పుడు తొలగించవచ్చు కూడా.

ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌ స్టార్టప్‌ సన్‌-వేస్‌ మాట్లాడుతూ… “రైలు మార్గాల్లో చాలావరకు కేటాయించిన స్థలం అనేది వృధాగా పోవడం చూసి ఈ ఆలోచన వచ్చింది.ఎప్పటినుండో మేము దీనికోసం కృషి చేస్తూ వస్తున్నాము.అలాంటి స్థలాన్ని కూడా వాడుకొనే ఉద్దేశంతోనే మేము వీటిని అభివృద్ధి చేసాము.ఇక వీటిని ఇక్కడే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రైలు మార్గాల్లో కూడా అమర్చవచ్చు.” అని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube