సీనియర్ నటుడు నరేష్( Naresh ) పవిత్రా లోకేష్‌తో( Pavitra Lokesh ) సహజీవనం చేస్తూ మూడో పెళ్లానికి అడ్డంగా దొరికిపోయి రెండు తెలుగు రాష్ట్రాల్లో నవ్వుల పాలయ్యాడు.అయితే సహ నటీమణులతో లింక్ పెట్టుకోవడమే కాక తన పేరుకు ముందు, వెనక బిరుదులు లింకు చేసుకోవడం కూడా ఇతడికి అలవాటే.
రీసెంట్‌గా ఈ సీనియర్ హీరో ఒక ట్వీట్ చేశాడు.అందులో నైక్ ఎయిర్ షూస్ కోసం తిరుపతిలో ఎంత తిరిగినా దొరకలేదని వాటి కోసం మళ్లీ హైదరాబాద్ కి బయలుదేరాల్సిందే అని చెప్పాడు.
ఈ మాటల్లో తేడాగా ఏమీ లేదు కానీ అతను ట్వీట్ లో తన పేరుకు ముందు హెచ్.ఈ… డీఆర్ అనే ఒక అవార్డులు, బిరుదుల లాంటివి తగిలించుకున్నాడు.
ఈ హెచ్.ఈ, డీఆర్ పొందే అర్హత నరేష్ కి ఎక్కడుందని చాలామంది ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారు.
మామూలుగా సమాజంలో అధికారిక మర్యాదలు దక్కాల్సిన ప్రజలకు, ఉన్నత పోస్టుల్లో ఉన్న వారి నేమ్స్ ముందు హిజ్ ఎక్సలెన్సీ( His Excellency ) అని రాస్తుంటారు.ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్లు ఇలాంటి వారి పేర్ల ముందు ఇది కనిపిస్తుంది.మరి అలాంటిది నరేష్ ఎందుకు తగిలించుకున్నాడు? ఏం అర్హత ఉందని దానిని తన పేరు ముందు అంత ధైర్యంగా పెట్టుకున్నాడు?
ఈ ట్వీట్‌లో మాత్రమే కాదు గతంలో చంద్రబాబుకు( Chandrababu Naidu ) మా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నప్పుడు రాసిన ఒక లేఖలో కూడా సేమ్ సంతకం ముందు హెచ్.ఈ అని రాసేసాడు.ఐసీడీఆర్‌హెచ్‌ఆర్‌పీ నుంచి హిజ్ ఎక్సలెన్సీ టైటిల్, పీహెచ్‌డీ పొందాడని నరేష్ చరిత్ర చూస్తే తెలుస్తోంది.ఆ సంస్థ ఐక్యరాజ్యసమితికి( UNO ) సంబంధించినది.ఐరాస నరేష్ నుంచి డబ్బులు తీసుకుని హిజ్ ఎక్సలెన్సీ టైటిళ్లు ఇచ్చిందేమో అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నిజానికి నరేష్ ప్రజలకు మానవ హక్కులు, దేశాల దౌత్య సంబంధాలు, శాంతి కోసం ఈయన ఉద్దరించింది ఏమీ లేదు.
దాన్ని బట్టి అతడు డబ్బులు ఇచ్చి ఈ బిరుదులను కొనుక్కున్నాడేమో అని తెలుస్తోంది.
నిజానికి అర్హులు అయితేనే ఈ పదాన్ని భుజకీర్తులుగా ధరించాలి కానీ నరేష్ మాత్రం తన పేరు ముందు పెట్టేసుకొని తనకు తానే గొప్ప అనుకుంటున్నాడు.ఇలాంటి సొంత డప్పు కొట్టుకునే తీరు బహుశా ఏ నటులలో కనిపించదని కూడా చెప్పుకోవచ్చు.నిజానికి మిగతా యాక్టర్స్ తో పోలిస్తే నరేష్ ఒక మనిషిగా చాలా దిగజారాడని చెప్పుకోవచ్చు.
వృద్ధ వయసులో కూడా యువకుడి లాగా పవిత్ర లోకేష్ తో( Pavitra Lokesh ) బహిరంగంగా ముద్దులాటలు ఆడుతూ షాక్ ఇస్తున్నాడు.