బిగ్‌బాస్‌ 3 విన్నర్‌, సోషల్‌ మీడియాలో ఆ పేరే ఎక్కువ వినిపిస్తుంది

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ముగింపు దశకు వచ్చింది.ఈ వారం ఇంట్లో ఏడుగురు ఉండగా, ఏడుగురు కూడా ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారు.

ప్రస్తుతం వస్తున్న ఓట్ల ఆధారంగా చూసుకున్నట్లయితే బిగ్‌బాస్‌ విన్నర్‌ ఎవరో తేలిపోతుందని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.ఇంటి సభ్యులు అంతా కూడా నామినేషన్స్‌లో ఉన్నారు కనుక ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారే ఫైనల్‌ విన్నర్‌గా కూడా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Social Media Talk Is Telugu Big Boss Winner Is Rahul

  ఈ వారంలో ఎలిమినేషన్‌లో ఉన్న వారి ఓట్లను పరిశీలించినట్లయితే అత్యధికంగా రాహుల్‌కు ఓట్లు పడుతున్నట్లుగా తెలుస్తోంది.ఆయన జెన్యూన్‌గా ఆడుతూ తన పని తాను చేసుకుంటూ నాటకాలు ఆడకుండా ఆకట్టుకుంటున్నాడు అంటూ అంతా అనుకుంటున్నారు.అతడు బోల్డ్‌గా తాను ఒక బార్బర్‌ను అని, డబ్బు గెలిస్తే బార్బర్‌ షాప్‌ పెట్టుకుంటానంటూ సింపుల్‌గా చెప్పిన మాటలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Social Media Talk Is Telugu Big Boss Winner Is Rahul

  అందుకే రాహుల్‌కు అత్యధికంగా ఓట్లు పడుతున్నాయి.ఆ కమ్యూనిటీ వారు మొత్తం కూడా రాహుల్‌కు ఓట్లు గుద్దేస్తున్నారు అంటూ టాక్‌ వినిపిస్తుంది.ఈ సమయంలోనే శ్రీముఖి ఆ తర్వాత స్థానంలో నిలిచింది.

Social Media Talk Is Telugu Big Boss Winner Is Rahul
Advertisement
Social Media Talk Is Telugu Big Boss Winner Is Rahul-బిగ్‌బాస�

  మొదట్లో ఆమెకు మంచి ఫాలోయింగ్‌ ఉన్నా కాస్త డల్‌ అయ్యింది.ఆమెకు ఓట్లు కాస్త తక్కువ వస్తున్నట్లుగా తెలుస్తోంది.మూడవ స్థానంలో వరుణ్‌ ఉన్నాడు.

ఈయన కూడా గట్టి పోటీ ఇస్తాడట.రాహుల్‌తో పాటు శ్రీముఖి మరియు వరుణ్‌లు కూడా గట్టి పోటీదారులు.

కాని రాహుల్‌కు ఎక్కువ ఛాన్స్‌ ఉందని సోషల్‌ మీడియా టాక్‌.

టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!
Advertisement

తాజా వార్తలు