ఆ సీన్స్ చేయాలంటే శోభన్ బాబుకు మరీ బద్దకం అట..

శోభన్ బాబు ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన అందాల నటుడు.అమ్మాయిల కళల రాకుమారడు.

ఆయన అంత గొప్ప అందగాడు కాబట్టే అప్పటి మహిళల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది.అయితే, నిజానికి మహిళా లోకంలో ఆయన యువరాజుగా వెలిగిపోవడానికి కారణం శోభన్ బాబు అందం కాదు.

ఆయన ఎన్నుకునే కథలు.ఆయన సినిమాలన్నీ ఆడవాళ్ళ మనసులను తాకినవే కావడం విశేషం.

శోభన్ బాబు కథ ఎంత బాగుంది అనుకోవడం కంటే కథలో మహిళా ప్రేక్షకులకు నచ్చే కథాంశాలు ఏమి ఉన్నాయి.అలాంటి అంశాలు ఉంటేనే ఆ సినిమా చేసేవారు.

Advertisement

ఇక సినిమాలో బాగా ఫ్రెష్ గా కనిపించడానికి షూటింగ్ స్పాట్‌ లో శోభన్ బాబు ఒళ్లు నలగనిచ్చేవారు కాదని ఆయనతో పని చేసిన వాళ్ళు చెబుతూ ఉంటారు. దర్శకుడు షాట్ బాగా రాలేదు ఇంకో టేక్ చేద్దామా అని అడిగి చాల్లేద్దూ ఎన్నిసార్లు చేసినా అది ఇంతే అంటూ చిన్న నవ్వు నవ్వి వదిలేసే వారు.

ఇక ఏదైనా రిస్కీ షాట్స్‌ చేయాల్సి వస్తే ఆ షూటింగ్ కి దూరంగా ఉండేవారు.వేరే వాళ్లతో ఆ షాట్ పూర్తి చేసిన తరువాతే మళ్ళీ సెట్ లోకి అడుగుపెట్టేవారు.

అందుకే శోభన్ బాబు ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలే చేయడానికే ఇష్టపడేవారు.ఆయన సినిమాల్లో ఫైట్లు తక్కువగా ఉండేవి.

ఆయన హీరోగా వచ్చిన కోడెత్రాచు లాంటి సినిమాలో కావాలని ఫైట్లు పెట్టారు దర్శకనిర్మాతలు.ఆ ఫైట్లు గురించి విన్న శోభన్ బాబు చిన్న నిట్టూర్పు విడిచి ఎందుకయ్యా నా మీద ఈ ఫైట్లు.అసలు ఎవరన్నా చూస్తారంటారా ఫ్యామిలీ సీన్స్ తీసుకుంటే ఏ బాధ ఉండదు కదా అని అనేవారట.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన .. ఆమెనూ తప్పిస్తున్నారా ? 

ఆ సమయంలో అక్కడ ఉన్న రామానాయుడుఅది కాదండీ, ఎప్పుడూ ఫ్యామిలీ డ్రామాలే చేస్తే ఏం బాగుంటుంది.ఏడాదికి ఒకటైన ఇలా యాక్షన్ సినిమాలు కూడా చేస్తే ప్రేక్షకులు ఫ్రెష్ గా ఫీల్ అవుతారు పైగా వైరైటీగా కూడా ఉంటుందని చెప్పిన తరువాత నుండి శోభన్ బాబు యాక్షన్ ఫిల్మ్ చేయడానికి ఆసక్తి చూపించారు.

Advertisement

అప్పటి నుండి ఒకటి రెండు ఫైట్లు ఉన్న సినిమా ఏడాదికి కనీసం ఒక్కటి అయినా చేయాలని నిర్ణయించుకుని చివరి వరకు అలాగే చేశారు.

తాజా వార్తలు