కార్తీక దీపం బెస్ట్ విలన్  అవార్డ్ సొంతం చేసుకున్న మోనిత.. సంతోషంలో నటి?

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి సీరియల్స్ లో కార్తీకదీపం(Karthika Deepam,) సీరియల్ ఒకటి ఈ సీరియల్ లో దీప కార్తీక్  మోనిత పాత్రలలో నటించినటువంటి నటీనటులకు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో అభిమానులు పెరిగిపోయారనే విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సీరియల్ లో మోనిత పాత్రలో నటించిన శోభా శెట్టి (Sobha Shetty) ఇటీవల బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సీరియల్ లో ఈమె నెగిటివ్ పాత్రలో నటించి తనలో ఉన్నటువంటి విల నిజాన్ని బయటపెట్టారు.

ఇక ఈ సీరియల్ నెగటివ్ పాత్రలో నటించినందుకు ఈమెకు రాష్ట్రీయ గౌరవ అవార్డు లభించింది.

ఈ అవార్డు అందుకున్నటువంటి శోభా శెట్టి సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ తనకు కార్తీకదీపం సీరియల్ లో నెగిటివ్ పాత్రలో నటించినందుకు గాను రాష్ట్రీయ గౌరవ అవార్డు లభించిందని మీ అందరి ఆశీస్సులు ఇలా ఎప్పుడూ నా పైనే ఉండాలి అంటూ ఈమె అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Sobha Shetty Got Best Villan Award To Monitha Character In Karthika Deepam, Kart
Advertisement
Sobha Shetty Got Best Villan Award To Monitha Character In Karthika Deepam, Kart

ఇలా తన పాత్రకు ఇలాంటి గౌరవం దక్కి అవార్డు రావడంతో ఈమె ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఎంతో మంది అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి శోభా శెట్టి 14 వారాలపాటు హౌస్ లో కొనసాగి  14వ వారం హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఇక బిగ్ బాస్ తర్వాత ఈమె కేర్ ఎటు వెళ్తుందో తెలియాల్సి ఉంది.అయితే ఈమెకు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi )సినిమాలో ఓ పాత్రలో నటించే అవకాశం వచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు