బాలీవుడ్ అందగాడు రణ్‌బీర్ కపూర్, క్యూట్ లేడీ అలియా భట్ జంటగా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర మూవీలోని కేసరియ సాంగ్( Kesariya Song ) గురించి తెలియని వారు వుండరు.ఎందుకంటే ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
ఐతే ఈ పాటని ఐదు భాషల్లో ఆలపించిన ‘స్నేహ్‌దీప్ సింగ్ కల్సి’( Snehdeep Singh Kalsi ) తాజాగా ఏడు భాషల్లో ఈ సాంగ్‌ను హృద్యంగా ఆలపించడం విశేషం.లాగా 7 భాషల్లో కేసరియ సాంగ్‌ను పాడిన స్నేహ్‌దీప్ సింగ్ వీడియోను మన కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇపుడు అది తెగ వైరల్ అవుతోంది.
నెటిజన్లు దానిని తెగ లైక్ చేస్తున్నారు.అవును, రేడియో షోలో స్నేహ్‌దీప్ పెర్ఫామెన్స్‌తో కూడిన వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్ఠుకుంటోంది.ఈ క్లిప్‌లో ఆర్జే శౌర్య స్నేహ్‌దీప్ కల్సిని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఆపై కేసరియను 7 భాషల్లో ఆలపించాలని ఛాలెంజ్ విసరడం ఇక్కడ చూడవచ్చు.ఇక ఈ క్లిప్‌లో కల్సి మళయాళం, పంజాబీ, తెలుగు, తమిళ్, కన్నడ, గుజరాతీ భాషల్లో కేసరియ ఆలపిస్తూ చివరిగా హిందీలో శ్రావ్యంగా పాటను ఆలపించడంతో వీడియో ముగుస్తుంది.
కాగా ఈ మధురమైన వీడియోను ఇప్పటివరకూ 5.9 లక్షల మంది వీక్షించగా భారీ సంఖ్యలో నెటిజన్లను దానిని ఇష్టపడుతున్నారు.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.పలు భాషలపై స్నేహ్‌దీప్ కల్సికి ఉన్న పట్టును ఈ వీడియో క్లిప్ చెప్పకనే చెబుతోంది.తన వీడియోను షేర్ చేసిన పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాకు స్నేహ్‌దీప్ తాజాగా ధన్యవాదాలు కూడా తెలిపారు.ఈ వీడియో మీకు చేరువవడం, నాపై ఇంత ప్రేమను కురిపిస్తూ బాసటగా నిలవడం ఊహించలేకపోతున్నానని మహీంద్ర పోస్ట్‌ను షేర్ చేస్తూ స్నేహ్‌దీప్ కల్సి రాసుకొచ్చారు.