మార్చి 2024లో భారత మార్కెట్లో లాంచ్ కానున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్లు ఏవో.వాటికి సంబంధించిన ధర, స్పెసిఫికేషను వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
వివో V30 సిరీస్ స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్ మార్చి ఏడవ తేదీ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవ్వనుంది.ఈ సిరీస్ లో వివో V30,( Vivo V30 ) వివో V30 ప్రో( Vivo V30 Pro ) అనే రెండు హ్యాండ్ సెట్ లు మార్కెట్లోకి విడుదల అవ్వనున్నాయి.ఈ వివో స్మార్ట్ ఫోన్లు ZEISS ప్రొఫెషనల్ పోర్ట్రేయిట్ కెమెరా, స్టూడియో క్వాలిటీ ఆరా లైట్ తో పాటు అద్భుతమైన ఫీచర్లతో ఉండనుంది.
శాంసంగ్ గెలాక్సీ A55 స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్( Samsung Galaxy A55 ) 6.5 అంగుళాల AMOLED డిస్ ప్లే తో ఉంటుంది.12GB RAM+ 256GB స్టోరేజ్ తో ఉంటుంది.5000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది.ట్రిపుల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంటుంది.ఈ ఫోన్ ఖచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా వెల్లడించలేదు కానీ మార్చి లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో ఈ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
నథింగ్ ఫోన్2(a) స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్( Nothing Phone 2a ) 6.7 అంగుళాల OLED డిస్ ప్లే తో ఉంటుంది.8GB RAM+ 128GB స్టోరేజ్ తో ఉంటుంది.మీడియా టెక్ యొక్క డైమెన్సిటీ 7200 SoC ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా తో ఉంటుంది.ఈ ఫోన్ మార్చి 5న లాంచ్ కానుంది.
Xiaomi 14 స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్ 6.3 అంగుళాల OLED డిస్ ప్లే తో ఉంటుంది.లైకా ట్యూన్డ్ కెమెరాలు, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్ తో వస్తుంది.మార్చి 7వ తేదీ భారత మార్కెట్లో విడుదల కానుంది.