శృతిహాసన్ లవ్ ఎఫైర్ గురించి గత రెండు నెలలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.ఈ అమ్మడి కొత్త బాయ్ ఫ్రెండ్ పేరు మైకేల్ కోర్సాలే అని, ఇటలీకి చెందిన ఇతను ప్రస్తుతం లండన్ లో ఉంటున్నాడని ఈ వార్తల సారాంశం.
గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి మైకేల్ మాటిమాటికి ఇండియా రావడం, తన బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వీలు చిక్కినప్పుడల్లా శృతి లండన్ వెళ్ళడం తరుచుగా జరిగేదే.వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళిష్టం .కాని ఈ పనుల వలన శృతి ప్రొఫేషనల్ లైఫ్ కి దెబ్బపడకపోతే చాలు.
శృతి షూటింగ్ ఎగ్గొట్టి మరి మైకేల్ తో కబుర్లు పెడుతోందని, షికారుకెళుతోందని ఓ పెద్ద కంప్లయింట్ ప్రచారంలో ఉంది.
ఇది నిజమేనేమో, ఎందుకంటే శృతి కాటమరాయుడు ప్రమోషన్స్ లో పాల్గొనలేదు.ఏదో మొక్కుబడిగా ట్విట్టర్లో ట్వీట్ వేయడం తప్ప, సినిమాని పట్టించుకోనే లేదు కమల్ హాసన్ గారాలపట్టి.
అంతెందుకు .శృతి ఇప్పుడు, ఈ నిమిషం ఎక్కడుంది అనుకుంటున్నారు? ఇండియాలో లేదు.
శృతి ప్రస్తుతం లండన్ లోనే ఉంది.ఇదేదో గాలికబురు అనుకునేరు .శృతి ఇంస్టాగ్రామ్ ఎకౌంట్ లో రీసెంట్ పోస్ట్ చూస్తే మీకే అర్థమయిపోతుంది.లండన్ లో ఉన్నట్లు, ఇటాలియన్ డిన్నర్ చేస్తున్నట్లు, లవ్ లీ బాయ్, నేను అదృష్టవంతురాలినని పోస్ట్ చేసింది శృతి.
లండన్ లో ఉంటున్న ఆ లవ్ లీ ఇటాలియన్ బాయ్ పేరు బయటపెట్టకపోయనా, మనకు తెలియకుండా ఉంటుందా? కాటమరాయుడు ప్రమోషన్స్ ఎగ్గొట్టి లండన్ లోనే బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోంది ఈ 31 ఏళ్ళ స్టార్ హీరోయిన్.







