అప్పట్లో మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకొని ఎన్నో కామెడీ అలాగే మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన శివాజీ రీసెంట్ గా వచ్చిన బిగ్ బాస్ 7 ( Biggboss7 ) రియాల్టీ షో కి వచ్చి మళ్లీ కంబ్యాక్ ఇచ్చారు.అయితే ఈయన చాలా సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఇక బిగ్ బాస్ రియాల్టీ షో కి రావడం వల్ల మరొకసారి ఆయన ఇండస్ట్రీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అందరికీ అర్థమైంది.ఇక బిగ్ బాస్ లో ఈయన ఆడిన ఆటకి, అలాగే ఈయన చాణిక్య తెలివితేటలకి చాలామంది ఫిదా అయ్యారు.
దాంతో శివాజీ ( Sivaji ) కి వరుస ఆఫర్స్ వస్తాయని అందరూ భావిస్తున్నారు.అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ.
నేను అప్పట్లో ఎన్నో సినిమాల్లో అవకాశాలు కోల్పోయాను.

రవితేజ హీరోగా చేసిన నా ఆటోగ్రాఫ్ ( Naa Autograph ) సినిమాలో ముందుగా నాకే అవకాశం వచ్చింది.ఎందుకంటే మిస్సమ్మ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నా ఆటోగ్రాఫ్ సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ నా దురదృష్టం ఏంటో గానీ ఆ సినిమా చివరికి రవితేజ చేతుల్లోకి వెళ్ళింది.అయితే రవితేజ చేసిన నా ఆటోగ్రాఫ్ సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయింది.
కానీ నేను ఆ సినిమాలో చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది.ఎందుకంటే ఆ కథ నాకు బాగా సూట్ అయ్యేది.
అయితే రవితేజ ( Raviteja ) అప్పటికే మాస్ ఇమేజ్ తెచ్చుకోవడంతో ఆయనకు ఆ కథ సెట్ అవలేదు.

అలాగే రాజా, జెనీలియా నటించిన మిస్టర్ మేధావి ( Mister medhavi ) సినిమాలో కూడా రాజా ప్లేస్ లో ముందుగా హీరోగా నన్నే తీసుకున్నారు.కానీ చివరికి రాజా చేతుల్లోకి వెళ్ళింది.అయితే ఈ సినిమా ముందు చెప్పిన స్టోరీ వేరు తర్వాత తెరకెక్కించిన స్టోరీ వేరు.
ఒకవేళ నేను వాళ్ళు ముందు చెప్పిన స్టోరీ తో గనుక హీరోగా చేసి ఉంటే కచ్చితంగా నేను స్టార్ హీరో అయ్యే వాడిని.నేను కేవలం హీరో గానే కాకుండా చాలా మంది హీరోలతో మల్టీస్టారర్ సినిమాల్లో కూడా చేశాను.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్, చిరంజీవి ( Chiranjeevi ) మాత్రమే కాకుండా మరి కొంతమంది హీరోల సినిమాల్లో కీలకపాత్రల్లో నటించాను.అందుకే కావచ్చు నా కెరియర్ కి అవి మైనస్ అయ్యాయి.
ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూసినవాళ్లు హీరోగా చూడలేకపోయారు.అయితే నేను చేసిన మోస్ట్ ఆఫ్ ది సినిమాస్ సూపర్ హిట్ అయ్యాయి.
కానీ స్టార్ హీరోగా మాత్రం పేరు రాలేదు.అంటూ శివాజీ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం శివాజీ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.