Music Director Raj: ‘రాజు’లు చాలా మంది ఉంటారు కానీ మంచి రాజులు కొందరే.. అలాంటి వాళ్లలో రాజ్ ఒకరంటూ?

ఇటీవలె సంగీత దర్శకుడు మే 21వ తేదీన ఆదివారం రోజు గుండెపోటుతో హైదరాబాదులోని తన నివాసంలో మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే.

రాజ్‌( Music Director Raj ) అసలు పేరు తోటకూర వెంకట సోమరాజు.

ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు.సంగీత ప్రపంచానికి రాజ్‌-కోటిగా( Raj - Koti ) మరుపురాని ఎన్నో పాటలను అందించారు.

రాజ్‌ మృతిని సంగీత ప్రియులు, పలువురు సినీ ప్రముఖులు జీవించుకోలేకపోతున్నారు.ఆయన మరణ వార్తని తెలుసుకున్న ఆ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేశారు.

అనంతరం రాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఇది ఇలా ఉంటే రాజ్ మృతికి సంతాపంగా తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో సంతాప సభను ఏర్పాటు చేశారు.ఈ సభకు హాజరైన పలువురు ప్రముఖులు రాజ్‌తో వారికి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Advertisement

ఈ సందర్భంగా నటుడు శివాజీ రాజా( Actor Shivaji Raja ) మాట్లాడుతూ.నాకు రాజ్‌ గారు దూరపు చుట్టం అవుతారు.నేను ఆర్టిస్ట్ అవుదామని అనుకుంటున్న సమయంలో మొదటిసారి వెళ్లింది ఆయన ఇంటికే.

రాజులు చాలామంది ఉంటారు కానీ అందులో మంచి రాజులు కొంత మందే ఉంటారు.అలాంటి వారిలో ఈ రాజ్‌గారు కూడా ఒకరు.

ఆయన తండ్రి ఇదే సినీ పరిశ్రమలో చాలా కాలం ఉన్నారు.రాజ్‌ గారికి ఎలాంటి అహంకారం కానీ, బేషజాలు కానీ ఉండేవి కావు.అందరితో చాలా డౌన్ టు ఎర్త్‌గా ఉండే వారు.

ఈ మధ్య ఒక టాప్ డైరెక్టర్ నాతో అన్నారు.రాజ్ కోటి ఉండడం వల్లే ఒక బడా మ్యూజిక్ డైరెక్టర్‌కు తెలుగులో ఎంటర్ కావడానికి ఐదేళ్లు పట్టిందట.

చేతుల‌ను తెల్ల‌గా, మృదువుగా మార్చే వాసెలిన్‌..ఎలాగంటే?

నా ప్రొడక్షన్‌లో ఒక సీరియల్ చేయాలని భావించినప్పుడు రాజ్‌గారి తో సాంగ్ చేయించాలని ఆయన దగ్గరికి వెళ్లాను.సీరియల్ కథ విని ఆయన కూడా ఒక పాత్ర వేస్తానని అన్నారు.

Advertisement

అలా ఆయనతో నాకు చాలా అనుభూతులు ఉన్నాయి.సిసింద్రీ సినిమా సమయంలో కూడా శివ నాగేశ్వరరావుగారితో కలిసి నన్ను పికప్ చేసుకుని కాస్త సమయం వెచ్చించేవారని తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు శివాజీ రాజా.

తాజా వార్తలు