తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss Season Seven ) తాజాగా ముగిసిన విషయం తెలిసిందే.ఇక ఈసారి సీజన్ విన్నర్ గా కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇకపోతే టాప్ త్రీ లో నిలిచిన కంటెస్టెంట్ శివాజీ( Shivaji ).హౌస్ లో మొదటి నుంచి తెలివిగా గేమ్స్ ఆడుతూ భుజానికి దెబ్బ తగిలినా కూడా లెక్కచేయకుండా టాప్ 3 వరకు వచ్చాడు.అయితే ఒకానొక సమయంలో శివాజీ ఈసారి విన్నర్ గా నిలుస్తాడు అంటూ ఊహాగానాలు కూడా వినిపించాయి.నిజంగానే శివాజీ మైండ్ గేమ్ వలన చాలామంది కంటెస్టెంట్స్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

అయితే శివాజీ పల్లవి ప్రశాంత్, యావర్( Pallavi Prashanth , Yavar ) లని తన శిష్యులుగా మార్చుకుని హౌస్ లో స్పై బ్యాచ్ ని తయారు చేసాడని నాగార్జున చెప్పారు.శివాజీకి కాస్త టెంపర్మెంట్ ఎక్కువ.మాట్లాడి తేహౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతా బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ నే బెదిరించేవాడు.ఇక టైటిల్ రేస్ లో ఉన్న శివాజీ వెనకపడిపోయి పల్లవి ప్రశాంత్ టాప్ 1 లోకి టైటిల్ ఫేవరేట్ గా మారడానికి ప్రధాన కారణం శివాజీ అమర్ దీప్ ని టార్గెట్ చెయ్యడమే.
అమర్ విషయంలో శివాజీ చేసిన ప్రతి పని అతను టైటిల్ రేస్ నుచి కిందకి జారిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.మొదటి నుంచి స్టార్ మా బ్యాచ్ అంటూ అమర్ దీప్, శోభా శెట్టి, సందీప్ మాస్టర్, ప్రియాంకలపై శివాజీ విషం చిమ్మడం ప్రేక్షకులకి నచ్చలేదు.

అంతేకాకుండా చివరి రెండు వారాల్లో శోభా శెట్టి, ప్రియాంకలపై శివాజీ చేసిన కామెంట్స్ అతనికి మరింత నెగిటివిటిని తెచ్చిపెట్టాయి.శోభా, ప్రియాంకలని ఉద్దేశించి మా ఇంట్లో ఇలాంటి అమ్మాయిలు ఉంటే గొంతు మీద కాలేసి తొక్కుతాను అంటూ సంచలనంగా మాట్లాడి బయట అమ్మాయిలకి టార్గెట్ అయ్యాడు.అక్కడే శివాజీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.మరోపక్క అమర్ దీప్ కి సింపతీ వర్కౌట్ అవడంతో శివాజీ కనీసం రన్నర్ స్థానంలోకి రాలేకపోయాడు.పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ దీప్ రన్నర్ అయ్యాడు.విన్నర్ అవుతాడనుకున్న శివాజీ మూడో స్థానంలో ఎలిమినేట్ అవడంతో అందరూ పాపం శివాజీ అంటున్నారు.