తెలుగు ప్రేక్షకులకు తమిళ స్థాయి హీరో శివ కార్తికేయన్( Hero Siva Karthikeyan ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తమిళంలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
శివకార్తికేయన్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోకి విడుదల అయ్యి మంచి సక్సెస్ ని కూడా సాధించాయి.అలాగే ఆయన తెలుగులో కూడా పలు సినిమాలలో నటించారు.
ప్రస్తుతం చేతినిండా బోలెడు సినిమా అవకాశాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు శివ కార్తికేయన్.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో( social media ) శివకార్తికేయన్ సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.అదేమిటంటే హీరో శివకార్తికేయన్ ముచ్చటగా మూడోసారి తండ్రి అయ్యాడు.ఇతడి భార్య ఆర్తి ( Arti )పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
జూన్ 2న బిడ్డ పుట్టినప్పటికీ ఒక రోజు లేటుగా శివకార్తికేయన్ ఈ విషయాన్ని బయటపెట్టాడు.తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఒక పోస్ట్ కూడా చేశారు.ఇకపోతే కార్తికేయన్ విషయానికీ వస్తే.

మొదట యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివకార్తికేయన్.3 సినిమాతో సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా మారి వరస హిట్స్ అందుకున్నాడు.రీసెంట్ టైంలో మహావీరుడు, అయలాన్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించాడు.







