మెగా హీరో సినిమాకు నో చెప్పిన మృణాల్‌ ఠాకూర్‌.. అసలు విషయం ఇదే

Sitaramam Heroine Mrunal Thakul Clarity About Mega Hero Movie Rumors Details, Mega Hero, Mrunal Thakur, Nani Film, Sitaramam, Heroine Mrunal Thakur, Mrunal Thakur Nani Movie

హిందీ సీరియల్స్ లో నటించి సుదీర్ఘ కాలం పాటు అక్కడి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న మృణాల్ ఠాకూర్ ఇటీవలే హను రాఘవపూడి దర్శకత్వం లో వచ్చిన సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఆ సినిమా లో దుల్కర్ సల్మాన్ కి జోడి గా ఈ ముద్దుగుమ్మ నటించి ఆకట్టుకుంది.

 Sitaramam Heroine Mrunal Thakul Clarity About Mega Hero Movie Rumors Details, Me-TeluguStop.com

తెలుగు లో టాప్ హీరోయిన్ అయ్యే టాలెంట్ మరియు అందం ఉన్న ఈ అమ్మడు చాలా మంది ప్రేక్షకులకు నచ్చేసింది.

కాస్త ఆలస్యం గా నాని తో ఇటీవలే ఒక తెలుగు సినిమా కు కమిట్ అయింది.

ఆ మధ్య ఒక మెగా హీరో సినిమా ఆఫర్ వస్తే కథ నచ్చలేదు అంటూ తిరస్కరించిందని ప్రచారం జరిగింది.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మృనాల్ ఠాకూర్ స్పందిస్తూ తాను మెగా హీరో తో సినిమా ఛాన్స్ వస్తే కథ విషయం లో నో చెప్పాను అంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం నిజం కాదని క్లారిటీ ఇచ్చింది.

తనకు అసలు ఏ మెగా హీరో సినిమా లో నటించేందుకు అవకాశం రాలేదని.

Telugu Mrunal Thakur, Nani, Sitaramam, Telugu-Movie

పెద్ద హీరో లతో నటించే సమయం లో కాస్త కథ విషయం లో చూసి చూడకుండా వ్యవహరించేందుకు తాను రెడీ అన్నట్లుగా మృణాల్ పేర్కొంది.భారీ అంచనాల నడుమ నాని తో నటించబోతున్న సినిమా రూపొందుతున్నట్లుగా కూడా ఆమె పేర్కొంది.ముందు ముందు తెలుగు లో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయాలని ఉద్దేశం తో తాను ఉన్నానని.

Telugu Mrunal Thakur, Nani, Sitaramam, Telugu-Movie

అదే సమయం లో ఇతర భాషల్లో కూడా సినిమా లు చేయాలని భావిస్తున్నట్లుగా పేర్కొంది.తెలుగు లో ఈ అమ్మడు నటించిన ఒకే ఒక సినిమా సీతారామం సూపర్ హిట్ అవడం తో ఒకే సారి నాలుగైదు ఆఫర్స్ ఈ అమ్మడి తలుపు తడతాయని అంతా భావించారు.కానీ ఇప్పటి వరకు నాని సినిమా ను మాత్రమే కమిట్ అయింది.ఈ ఏడాది మరో రెండు మూడు సినిమాల్లో ఈ అమ్మడం నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube