వైఎస్ వివేకానంద హత్యాలో సాక్ష్యాలు తారుమారు! సంచలన వాస్తవాలు బయటపెట్టిన సిట్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

ఈ హత్య కేసు విచారణ కోసం ఏపీ ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసింది.

ఇప్పుడు ఈ కేసుపై విచారణ మొదలెట్టిన సిట్ బృందం హత్య వెనుక మిస్టరీని చేదించే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే ఈ కేసులో లోతుగా అధ్యయనం చేసిన సిట్ పోలీసులు ఎబ్భై మందిని విచారించారు.

అలాగే ఈ కేసులో మొదటి నుంచి ముద్దాయిగా అనుమానిస్తున్న పరమేశ్వర్ రెడ్డిని ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు.ఇక ఇప్పుడు ఈ కేసు రాజకీయ రంగు పులుముకోవడంతో పాటు, వైసీపీ, టీడీపీ ఎన్నికల అస్త్రంగా మారిఅపోయింది.

ఇదిలా ఉంటే ఈ కేసులో విచారణ చేస్తున్న సిట్ బృందం సాక్ష్యాలు తారుమారు చేసారనే అభియోగాలతో ముగ్గురుని అరెస్ట్ చేసారు.వారిని కోర్ట్ ముందు హాజరు పరచడంతో వారిని అరెస్ట్ చేయడానికి గల కారణాలని తెలియజేసే రిమాండ్ రిపోర్ట్ ని కూడా అందించింది.

Advertisement

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి సంచనల నిజాలు బయటకి వచ్చాయి.దాదాపు రెండు లీటర్ల రక్తాన్ని తుడిచారు.

గాయాలకు కట్లు కట్టారని, రక్తంలో తలవెంట్రుకలు, బొట్టు బిళ్లలు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.ఘటనాస్థలిలో లేఖను దాచారు.

కొందరికి ఫోన్లు చేశారని, మృతదేహాన్ని వారే ఘటనాస్థలి నుంచి మార్చురీకి తరలించారు.కావాలని సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేసారని ఇలా చేయాలని వారికి ఎవరు చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని దర్యాప్తు అధికారులు తెలిపారు.

మరి ఈ కేసులో సిట్ విచారణలో ఇంకెన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు