ఎమోషన్స్ ఇక్కడ మనుషులకే కాదు.ఈ భూమిపై వున్న ప్రతి జీవరాశికి ఉంటాయి.
అవి నవ్వుతాయి, ఏడుస్తాయి, అలుగుతాయి, మారాం చేస్తాయి, డాన్సులు చేస్తాయి, పాటలు పడుతాయి.అవును.
అయితే వాటిని మన హృదయంతో చూడాలి అంతే.తాజాగా ఓ ఊరిలోని చెరువు తీవ్ర మానసిక క్షోభని అనుభవిస్తూ ఆ వూరి ప్రజలకు ఓ వుత్తరం రాసింది.
ఆ ఉత్తరంలో తన గొడ్డుని వెళ్లబుచ్చుకుంది.ఫ్లెక్సీ రూపంలో ఆ చెరువు దగ్గర వున్న ఓ నోటీసుని చూసి దారినపోయేవారు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు.
మంచినీటి చెరువే తన బాధను వర్ణిస్తున్నట్లుగా ఉన్న ఆ ఫ్లెక్సీ.సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే, APలోని గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలోని మంచినీటి చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ.చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది.ఆవూరిలోని కొంతమంది యువకులు కలిసికట్టుగా ఓ మంచినీటి చెరువుకి పట్టిన దౌర్భాగ్యాన్ని ఆ వూరి ప్రజలకు తెలియజేసేందుకు వినూత్నంగా అలోచించి, ఆ చేరువే స్వయంగా చెబుతున్నట్టు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు.ప్రజలు తమ స్వార్థం కోసం చేస్తున్న పనులు.
తనకు ఎంతో బాధ కల్గిస్తున్నాయని.చెరువు తన ఆవేదనను చెప్పినట్లుగా ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
దానిమీద వున్న టెక్స్ట్ ఒకసారి చూస్తే.“సిరిపురం వాసులకు విజ్ఞప్తి.గతంలో నా మీద చెత్త, వ్యర్థపదార్థాలు వేసి, మద్యపానం సేవించి అపరిశుభ్రంగా ఉంచారు.భరించాను.అలాగే గతంలో గ్రూప్ రాజకీయలు చేసి, నన్ను అభివృద్ధి చేయలేదు.అయినా సహించాను.
ఇప్పుడు మీ స్వలాభాల కోసం నా మీద అక్రమ కట్టడాలు కడుతూ.నన్ను ఆక్రమిస్తున్నారు.
మీరు చేస్తున్న పనులు నాకు ఎంతో బాధను కల్గిస్తున్నాయి.గుడిని, బడిని, ఇంటిని శుభ్రం చేసినట్లుగా.
దయచేసి నన్ను పరిశుభ్రం చేయండి.నన్ను అభివృద్ధి చేసి.జాగ్రత్తగా చూసుకుంటే, నేను మన గ్రామాన్ని, మిమల్ని… భవిష్యత్ తరాలను కాపాడతానని హామీ ఇస్తున్నాను.” అని అక్కడ వెలసిన ఫ్లెక్సీ అందరినీ ఆలోచింపజేస్తుంది.