‘బ్రహ్సోత్సవం’లో సునీత?

టాలీవుడ్‌లో సునీతకు ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెల్సిందే.

పాటలు పాడటంతో పాటు, డబ్బింగ్‌తో కూడా తన కంటూ ప్రత్యేక శైలిని కలిగి ఉన్న సునీతను వెండి తెరపైకి తీసుకు వచ్చేందుకు పలువురు నిర్మాతలు మరియు దర్శకులు సైతం ప్రయత్నించారు.

కాని నటనపై ఆసక్తి లేక పోవడంతో ఇప్పటి వరకు వెండి తెరకు దూరంగా ఉంటూ వచ్చింది.తాజాగా ఈమె నటించాలనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

త్వరలోనే ఈమె వెండి తెరపై తళుక్కున మెరిసే అవకాశాలున్నాయి.మహేష్‌బాబు సినిమాలో సునీత ఒక ముఖ్య పాత్రకు ఎంపిక అయినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో ఈమె మహేష్‌బాబుకు సోదరిగా నటించబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఈ సినిమాను వచ్చే నెలలో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisement

మహేష్‌ సినిమాలో నటించే అవకాశం రావడంతో సునీత ఓకే చెప్పినట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

నా పతనానికి కారణం అదే : యాక్ట్రెస్ ప్రగతి
Advertisement

తాజా వార్తలు