ఈ తరం ప్రేక్షకులకు లెజెండరీ సింగర్ అయినా ఎల్ ఆర్ ఈశ్వరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈశ్వరి గురించి తెలియకపోయినా ఆమె పాడిన పాటలు మాత్రమే ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు.
మాయాదారి చిన్నోడు మనస్సే లాగేసిండు, లేలే నా రాజా, మసక మసక చీకటిలో, మల్లె తోట ఎనకాలా, భలే భలే మగాడివో బంగారు నా సామివోయ్ అంటూ ఎన్నో పాటలను తన మధురమైన గొంతుతో ఎన్నో పాడి సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఈశ్వరి. ఇక 60- 70ల కాలంలో అయితే ఆమె పాడిన పాటలు కుర్ర కారుకు పిచ్చెక్కించడంతోపాటుగా ఆమె పాడిన పాట ఏదైనా కూడా హిట్ అవ్వాల్సిందే.

అప్పట్లో టాప్ సింగర్ గా ఒక వెలుగు వెలిగింది ఈశ్వరి.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈశ్వరి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఎక్కువగా ఐటెం పాటలు మత్తెక్కించే పాటలు రావడం వెనుక ఉన్న కారణం గురించి స్పందిస్తూ తాను హుషారుగా పాడుతానని అందుకే దర్శకుడు తనకు ఆపాటలే ఇచ్చారు అని ఆమె తెలిపింది.అయితే ప్రస్తుతం టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి కానీ అందులో ఎవరూ కూడా తను పాడిన పాటలు పాడరని కారణం ఎందుకో తనకు కూడా తెలియదు అని తెలిపింది ఈశ్వరి.
ఆ సమయంలో యాంకర్ ఆమెతో ఊ అంటావా మామా సాంగ్ పాడించారు.ఈ పాటపై అభిప్రాయం అడగ్గా.

ఇది ఒక పాటనా? పై నుంచి క్రింది వరకూ ఒకేలా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఆరు లైన్లు ఒకేలా ఉన్నాయని అన్నారు ఈశ్వరి.ప్రస్తుతం ఏ పాటలు అంతగా నచ్చడం లేదని,తాను పాడిన పాటలు ఇప్పటికీ నిలబడటానికి కారణం మా వర్క్ అంత సిన్సియర్ గా ఉండేది అని తెలిపింది ఈశ్వరి.అప్పట్లో ఒక్కో సినిమా 150 రోజులు నుండి 250 రోజులు ఆడేవి.
ఇప్పుడు 10 రోజులు ఆడితే గొప్పగా చెబుతున్నారు అంటూ నవ్వేశారు.అప్పట్లో మేం పాడిన సినిమాలు ఆడితే అవార్డులు ఇచ్చేవాళ్లని అన్నారు.







