ప్రముఖ భారతీయ నేపథ్య గాయని కనికా కపూర్‌కు( Singer Kanika Kapoor ) ప్రతిష్టాత్మక ‘‘ ఏషియన్ అచీవర్స్ అవార్డ్’’( Asian Achievers Award ) దక్కింది.లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
కనికాతో పాటు యూకే నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ అవార్డ్‌కు ఎంపికయ్యారు.భారతీయ భాషల్లో వందలాది పాటలు పాడి సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గాను కనికా కపూర్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
ఎన్‌హెచ్‌ఎస్ బెక్ల్సీ చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ నిక్కీ కనాని( Dr Nikki Kanani ) ‘‘ ప్రొఫెషనల్ ఆఫ్ ది ఇయర్’’గా( Professional of the Year ) నిలిచారు.నార్త్ వెస్ట్ అంబులెన్స్ సర్వీస్ కోసం చేసిన కృషికి గాను సల్మాన్ దేశాయ్.
కోవిడ్ 19 మరణాల తగ్గింపు లక్ష్యంగా శ్రమించిన డాక్టర్ లలిత అయ్యర్‌కు అవార్డ్ లభించింది.
ఈ సందర్భంగా పురస్కార విజేతలను యూకే ప్రధాని రిషి సునాక్( UK PM Rishi Sunak ) అభినందించారు.యూకేలో బ్రిటీష్ ఆసియన్లు సాధించిన అత్యుత్తమ విజయాలను గుర్తించడానికి ఏషియన్ అచీవర్స్ అవార్డ్స్ గొప్ప అవకాశాన్ని అందిస్తాయన్నారు.యూకేలో ఆధునిక, డైనమిక్, ప్రపంచస్థాయి ఆర్ధిక వ్యవస్థను రూపొందించడంలో నామినీలందరూ అందించిన సానుకూల ప్రభావం, సహకారానికి రిషి సునాక్ కృతజ్ఞతలు తెలిపారు.
అవార్డ్ తనకు దక్కడంపై కనికా కపూర్ స్పందించారు.యూకే ప్రధాని స్వయంగా అభినందించడం సంతోషంగా వుందన్నారు.
ఇకపోతే.ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగంలో బ్రిటీష్ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ జస్దీప్ సింగ్ దేగున్‌కు( Jasdeep Singh Degun ) అవార్డ్ దక్కింది.ఓబీఈ బ్రిటీష్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్‌లలో ముందంజలో వున్నందుకు డాక్టర్ హారెన్ జోతీకి( Dr Harren Jhoti ) ‘‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’’ అవార్డ్ గెలుచుకున్నారు.ఆంకాలజీ, కేంద్ర నాడీ వ్యవస్థ వ్యాధులకు ఔషధాలను కనుగొనడం, అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వానికి గుర్తింపుగా ఈ అవార్డ్‌కు ఎంపిక చేశారు.
ఇతర విజేతలలో తాని దులేకు ‘‘ఎంటర్‌ప్రెన్యూయర్ ఆఫ్ ది ఇయర్’’. కళాకారుడు , ఫోటోగ్రాఫర్ పౌలోమి దేశాయ్‌కి కమ్యూనిటీ సర్వీస్ విభాగంలో, మీడియా విభాగంలో అనిల్ ధామికి ‘‘ఏషియన్ అచీవర్స్ అవార్డ్’’ లభించింది.