తెలంగాణలో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు వాయిదా పడ్డాయి.ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్నికలను డిసెంబర్ 27 వ తేదీకి వాయిదా వేసింది.
ఈనెల 28న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర కార్మిక శాఖ సిద్ధమైన సంగతి తెలిసిందే.అయితే ఈ ఎన్నికలను వాయిదా వేయాలంటూ సింగరేణి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది.కాగా గత ఏడాది నుంచి సింగరేణిలో ఎన్నికల వివాదం కొనసాగుతోంది.
ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణపై హైకోర్టు గడువు పొడిగిస్తూ ఇప్పటికే మూడు సార్లు ఉత్తర్వులు జారీ చేసింది.ఎన్నికలు నిర్వహించాల్సిందిగా జూన్ 23న సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా ఈ ఉత్తర్వులపై చీఫ్ కోర్టులో సింగరేణి సంస్థ అప్పీల్ వేసింది.ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు సింగరేణి ఎన్నికలను వాయిదా వేసింది.







