అప్పటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ... స్పీకర్ గా ఎవరికి ఛాన్స్ ?

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది.మంత్రులుగా 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly meetings ) ఎప్పటి నుంచి మొదలవుతాయనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.అయితే 19 నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించారు.

అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రమాణ స్వీకరం చేయాలి .దీనికోసం ప్రత్యేకంగా సెషన్స్ నిర్వహించనుంది ప్రభుత్వం.ముందుగా ప్రోటెం స్పీకర్ గెలిచిన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ఆ తరువాత స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది.  ప్రస్తుతం ఉన్న సీనియారిటీ ప్రకారం చూసుకుంటే ప్రోటెం స్పీకర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ( MLA Gorantla Butchaiah Chaudhary )ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.

Advertisement
Since Then, Who Has A Chance To Be The Speaker Of The AP Assembly Meetings, AP E

అయితే స్పీకర్ గా ఎవరికి అవకాశం దొరుకుతుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది.

Since Then, Who Has A Chance To Be The Speaker Of The Ap Assembly Meetings, Ap E

 ఈ పదవి పై చాలామంది నేతలే ఆశలు పెట్టుకున్నారు.  ముఖ్యంగా ఉండి టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు( TDP MLA Raghuramakrishnam Raju ) గట్టి  ప్రయత్నాలే చేస్తున్నారు.అయితే స్పీకర్ రేసులో టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు( Ayyanna patrudu ) పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం .ఒకవేళ స్పీకర్ పదవిని జనసేనకు కేటాయించాల్సి వస్తే సీనియర్ నేత అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కు అవకాశం ఇస్తారని సమాచారం.

Since Then, Who Has A Chance To Be The Speaker Of The Ap Assembly Meetings, Ap E

టిడిపి తరఫున అయ్యన్నపాత్రునికి స్పీకర్ గా అవకాశం ఇస్తే జనసేన తరఫున మండలి బుద్ధ ప్రసాద్( Buddha Prasad ) కు డిప్యూటీ స్పీకర్ గా అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతుంది.అలాగే డిప్యూటీ స్పీకర్ గా పోలిశెట్టి శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తోంది.ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో అవకాశం దక్కని సీనియర్ నేతలు చాలామంది తమకే చంద్రబాబు స్పీకర్గా అవకాశం ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు.

మరి ఈ విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది తేలాల్సి ఉంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు