2023 సైమా వేడుకలకు హోస్ట్ గా వ్యవహరించనున్న రానా... మృణాల్ ఠాకూర్!

చిత్ర పరిశ్రమకు ఎన్నో అవార్డులను ప్రకటిస్తూ ఉంటారు.ఇలా చిత్రపరిశ్రమకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డులలో సైమా అవార్డ్స్ ( Siima Awards ) ఒకటి.

 Rana, Mrinal Thakur Will Host Saima Celebrations Siima Awards, Tollywood, Mruna-TeluguStop.com

సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలను ప్రోత్సహిస్తూ ప్రకటించే ఈ అవార్డులు గత 11 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాయి.అయితే ఈ ఏడాది సైమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాలకు కూడా ఏర్పాట్లు మొదలయ్యాయి.

అయితే ఈ అవార్డు వేడుకలను ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16 తేదీలలో నిర్వహించబోతున్నట్లు సైమా చైర్ పర్సన్ బృందాప్రసాద ( Brunda Prasad ) వెల్లడించారు.

ఇక ఈ సైమా అవార్డుల వేడుకను ఈ ఏడాది దుబాయి( Dubai )లో జరగబోతున్నట్లు తెలియజేశారు.అంతేకాకుండా ఈ సైమా అవార్డు వేడుకలకు స్పాన్సర్ గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నెక్సా ( Nexa )స్పాన్సర్ గా వ్యవహరించునున్నట్లు ఈమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా నటి మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) రానా ( Rana )కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ దక్షిణాది సినీ పరిశ్రమను సైమా ఒకే తాటిపైకి తీసుకువచ్చిందని ఆయన వెల్లడించారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ వేడుకలలో తాను భాగం కావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.

ఇక నటి మృణాల్ మాట్లాడుతూ…తన మొదటి సినిమా సీతారామం ( Sitaramam ) సినిమాతోనే తాను ఈ వేడుకలలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.దుబాయ్ లో జరిగే ఈ వేడుకలు పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం తాను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఈమె తెలియజేశారు.ఇక ఈ కార్యక్రమానికి రానా, మృణాల్ ఠాకూర్ హోస్టుగా వ్యవహరించబోతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube