ఫ్రిజ్ లో ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు పెట్టి తాగుతున్నారా..? అయితే మీరు ఈ వ్యాధుల బారిన పడినట్లే..

వేసవికాలంలో అందరూ చల్లటి నీటిని తాగాలని ఆశ పడుతుంటారు.అయితే ఒకటి రెండు వాటర్ బాటిల్లను ఎప్పుడూ చాలా మంది ఫ్రిజ్లో ఉంచుతూ ఉంటారు.

ఇక మరికొందరి ఏమో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో నీళ్లు నింపి ఫ్రిజ్లో( Refrigerator ) పెట్టి ఐస్ నీ తయారు చేసుకుంటారు.ఇక గాజు సీసాలో నీరు నింపి ఫ్రిజ్లో ఉంచినట్లయితే పిల్లల చేతులతో గాజు సీసా కచ్చితంగా పగలవచ్చు.

కాబట్టి ప్లాస్టిక్ బాటిల్( Plastic Water Bottle ) లో నీటిని చాలా మంది నింపుతారు.అలాగే ఫ్రిజ్లో ప్లాస్టిక్ బాటిల్లో నీటిని నింపకూడదని మీకు అస్సలు తెలిసి ఉండదు.

అయితే అమెరికాలో నిర్వహించిన పరిశోధనలో ప్లాస్టిక్ బాటిల్ లలో నీరు, గాజు సీసాలోని నీటిపై ఒక పరిశోధన చేయడం జరిగింది.అయితే ఈ పరిశోధనలో వాటర్ బాటిల్ లో రెండు రకాల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని వెలుగులోకి వచ్చింది.అలాగే ఇందులో నెగటివ్ బ్యాక్టీరియా,బాసిల్లస్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది.

Advertisement

ప్రతికూల బ్యాక్టీరియా( Bacteria ) అనేక రకాల ఇన్ఫెక్షన్ లకు దారి తీస్తుంది.అంతేకాకుండా దీనివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

జీర్ణక్రియ సంబంధిత సమస్యలను( Digestion problems ) కలిగిస్తుంది.మరి ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.

ఫ్రిజ్లో ఉంచిన బాటిల్లో మీరు ఊహించని దానికంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది.ఇలా చేయడం మీకు అనారోగ్యానికి గురిచేస్తుంది.

అందుకే ఫ్రిజ్లో నీటిని ఉంచినప్పుడు పొరపాటున కూడా చౌకైనా ప్లాస్టిక్ బాటిల్లను అస్సలు ఉపయోగించకూడదు.అటువంటి బాటిల్లో బ్యాక్టీరియా త్వరగా పెరగడం ప్రారంభమవుతుంది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

కాబట్టి అలాంటి బాటిల్ లలో నీరు ఉంచి తాగకూడదు.మీరు ఫ్రిజ్లో బాటిల్ ను ఉంచాలనుకుంటే మంచి నాణ్యమైన బాటిల్ లను ఉపయోగించాలి.అలాగే ఆ బాటిల్లను ప్రతి రెండు రోజులకు ఒకసారి శుభ్రం చేస్తూ ఉండాలి.

Advertisement

ఇలా చేయడం వలన ఎలాంటి ఇన్ఫెక్షన్స్( Infections ) మన రావు.అయితే ఫ్రిడ్జ్ లో ప్లాస్టిక్ బాటిల్ లో నీటిని ఎక్కువసేపు ఉంచితే కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

కాబట్టి బాటిల్ లను బాగా శుభ్రంగా కడగాలి.దీని కారణంగా బ్యాక్టీరియా శరీరంపై దాడి చేయదు.ఈ నీటి వలన మీకు కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

తాజా వార్తలు