ఏపీలో వైసీపీ (YCP) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆఖరి ‘సిద్ధం’ సభ (Siddam Sabha) కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం ( Addanki Constituency)లోని మేదరమెట్లలో జరగనుంది.
త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ (CM Jagan) వ్యూహాం ఎలా ఉండబోతుంది.? చివర సిద్ధం సభలో సీఎం జగన్ ఏం మాట్లాడనున్నారు.? పార్టీ క్యాడర్ కు ఎలాంటి దిశానిర్దేశాలు చేయనున్నారనే అంశాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి.వై నాట్ 175 ( Why Not 175) నినాదంతో ఎన్నికల బరిలో నిలవనున్న వైసీపీ నిర్వహించిన మూడు సిద్ధం సభలు ఒక ఎత్తు.
మేదరమెట్ల సిద్ధం సభ మరో ఎత్తు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.అలాగే ఈ సభా వేదికపై నుంచే సీఎం జగన్ ఎన్నికల మ్యానిఫెస్టో (Election Manifesto) ప్రకటించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
అయితే రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ మరియు జనసేన పొత్తు తరువాత వైసీపీ సిద్ధం సభ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.