తండ్రి సెక్యూరిటీ గార్డ్.. కూతురు ఎస్సై.. ఈ యువతి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!

ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలంటే రేయింబవళ్లు తీవ్రంగా శ్రమించాలి.మన కష్టానికి తల్లీదండ్రుల సహాయసహకారాలు దక్కితే కెరీర్ పరంగా సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

 Si Kaveri Success Story Details Here Goes Viral In Social Media , Kaveri, Si K-TeluguStop.com

సెక్యూరిటీ గార్డ్( Security guard ) కూతురు ఎస్సైగా ఉద్యోగం సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచింది.దూది కావేరి సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.

తాండూరు( Tandoor ) పట్టణంలోని పసారీ వార్డుకు చెందిన వీరేశం, నిర్మల కూతురు అయిన కావేరి పేదరికం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఆ ఇబ్బందులను అధిగమించి కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం గమనార్హం.దూది కావేరి తండ్రి పట్టణ శివారులో ఉన్న స్పిన్నింగ్ మిల్లులో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తుండటం గమనార్హం.

బాల్యం నుంచి కావేరి చదువు విషయంలో టాప్ లో ఉండేవారు.

శ్రీ సరస్వతీ విద్యామందిర్( Sri Saraswati Vidyamandir ) లో పదో తరగతి పూర్తి చేసిన కావేరి తాండూరు చైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు.

కావేరి డిగ్రీ ఓపెన్ లో పూర్తి చేయడం గమనార్హం.డీఎడ్ పూర్తి చేసిన తర్వాత కావేరి డీఎస్సీ( Cauvery DSC ) కోసం ఎదురుచూశారు.డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యం కావడంతో ఎస్సై కోసం కావేరి శిక్షణ తీసుకున్నారు.పట్టుదలతో కావేరి ఎస్సై లక్ష్యాన్ని సాధించి ప్రశంసలు అందుకున్నారు.

సెక్యూరిటీ గార్డ్ కూతురు కావేరి( Kaveri ) కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంతో ఆమె కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.కావేరి భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకొని కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను సాధించాలని ఆశిద్దాం.దూది కావేరి టాలెంట్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.కష్టపడితే ఆలస్యంగా అయినా సక్సెస్ దక్కుతుందని దూది కావేరి ప్రూవ్ చేశారు.చిన్న వయస్సులోనే దూది కావేరి ఉద్యోగం సాధించి వార్తల్లో నిలిచారు.

SI Kaveri Success Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube