చాలా మంది సెలబ్రేటిలు ఈ మధ్యకాలంలో ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు తన పెళ్లికి సంబంధించిన ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పకపోవడంతో చాలామంది అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు.
సినిమాలతో అందరినీ అలరించినప్పటికీ పెళ్లి కూడా చేసుకోవాలని ఇప్పటికే ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనను ఎన్నోసార్లు డిమాండ్ చేశారు.అంతేకాదు ఎక్కడ కనిపించినా కూడా పెళ్లెప్పుడు చేసుకుంటారు.
ఇంకెప్పుడు పెళ్లి అంటూ ఎన్నో రకాల ప్రశ్నలను ఆయనను అడుగుతుంటారు.ఇదిలా ఉంటే తాజాగా కృష్ణంరాజు భార్య శ్యామల దేవి ప్రభాస్ పెళ్లి పై ఒక గుడ్ న్యూస్ చెప్పింది.

మరి ఇంతకీ ప్రభాస్ పెళ్లిపై శ్యామల దేవి ( Shyamala devi ) చెప్పిన గుడ్ న్యూస్ ఏంటి.నిజంగానే ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.తాజాగా దేవీ నవరాత్రుల సందర్భంగా కృష్ణంరాజు భార్య శ్యామల దేవి విజయవాడలోని ఆ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చింది.ఇక అమ్మవారి దర్శనం తర్వాత మీడియా మిత్రులు శ్యామల దేవిని ముట్టడించి ప్రభాస్ పెళ్లి గురించి చెప్పమని ఆమెను ప్రశ్నించారు.
అయితే శ్యామల దేవి సానుకూలంగా స్పందించి ప్రభాస్ పెళ్లి కచ్చితంగా ఉంటుంది.ఇక త్వరలోనే మా ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది.నా భర్త లేకపోయినా ఇండస్ట్రీలో మా ఫ్యామిలీ పేరుని ప్రభాస్ ముందుకు తీసుకు వెళ్తున్నాడు.ఇక మా ఆయన బతుకుతున్నప్పుడే ప్రభాస్ ( Prabhas ) పెళ్లి చేద్దాం అనుకున్నప్పటికీ షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల అది కుదరలేదు.
ఇక వచ్చే ఏడాది దసరా లోపు కచ్చితంగా ప్రభాస్ ఒక ఇంటివాడు అవుతాడు.అయితే పెళ్లి డేట్ ఎప్పుడు.
అమ్మాయి ఎవరు.అనే విషయాన్ని మాత్రం నేను ఇప్పుడు బయటపెట్టను అంటూ శ్యామల దేవి చెప్పుకొచ్చింది.

ఇక శ్యామలాదేవి మాటలు విన్న చాలా మంది ప్రభాస్ అభిమానులు ఎగిరిగంతేస్తున్నారు.స్వయంగా ప్రభాస్ పెద్దమ్మ ప్రభాస్ పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పడంతో నిజమే అని ఉప్పోంగిపోతున్నారు.అంతేకాదు పెళ్లి చేసుకోబోయేది కూడా అనుష్క ( Anushka ) నే అని, అందుకే శ్యామలాదేవి ఆమె పేరుని బయట పెట్టలేదు అని చాలామంది ప్రభాస్ అభిమానులు ఒక రకమైన ఆనందంలో మునిగిపోయారు.ఇక ఇదే నిజం అవ్వాలని కూడా కోరుకుంటున్నారు.







