ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ టాప్-10 లో శుబ్ మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ..!

ఐసీసీ( ICC ) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో టాప్-10 లో ఏకంగా ముగ్గురు భారతీయ బ్యాటర్లకు చోటు దక్కడం విశేషం.భారత జట్టు ఓపెనర్ శుబ్ మన్ గిల్( Subhman Gill ) రెండో స్థానంలో నిలిచాడు.2019 జనవరిలో చివరిసారిగా ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్-10 లో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ ఉన్నారు.తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో శుబ్ మన్ గిల్ రెండో స్థానంలో, రోహిత్ శర్మ( Rohit Sharma ) ఎనిమిదవ స్థానంలో, విరాట్ కోహ్లీ( Virat Kohli ) 9వ స్థానంలో నిలిచారు.

 Shubman Gill Rohit Sharma And Virat Kohli In Top 10 Of Icc Mens Odi Rankings Det-TeluguStop.com

తాజాగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో భారత్- పాకిస్తాన్( India vs Pakistan ) మధ్య జరిగిన మ్యాచ్లో శుబ్ మన్ గిల్, రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.58 పరుగులు చేసి తాజా ర్యాంకింగ్స్ లో తాను ఉన్న స్థానం నుండి ఓ ర్యాంకు ఎగబాకాడు.ఈ మ్యాచ్లో సెంచరీ తో చెలరేగిన విరాట్ కోహ్లీ నాటౌట్ గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రికార్డును అందుకొని రెండు స్థానాలు ఎగబాకి తాజా ర్యాంకింగ్స్ లో 9వ స్థానంలో నిలిచాడు.

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం( Babar Azam ) మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.పాకిస్తాన్ జట్టు ప్లేయర్ ఇమాముల్ హక్( Imam Ul Haq ) ఐదవ స్థానంలో, ఫకర్ జమాన్ పదవ స్థానంలో ఉన్నారు.ఇతర భారత ఆటగాళ్ల విషయానికి వస్తే.

జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్( KL Rahul ) 10 స్థానాలు మెరుగుపరచుకొని 37వ స్థానంలో ఉన్నాడు.ఇషాన్ కిషన్ రెండు స్థానాలను మెరుగుపరచుకొని 22వ స్థానంలో నిలిచాడు.

భారత జట్టు బౌలర్ల విషయానికి వస్తే.కుల్దీప్ యాదవ్ ఐదు స్థానాలను మెరుగుపరచుకొని ఏడో స్థానంలో ఉన్నాడు.

సిరాజ్ తొమ్మిదవ స్థానంలో, బుమ్రా 27వ స్థానంలో, హార్దిక్ పాండ్యా 56వ స్థానంలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube