సలార్‌లో కూడా శృతి మించడం ఖాయం..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ కూడా ఒకటి.ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేష్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Shruti Hassan To Have Action Sequences In Salaar-TeluguStop.com

ఈ సినిమాను కేజీఎఫ్ తరువాత ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.ఇక ఈ సినిమాకు సలార్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర కూడా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

 Shruti Hassan To Have Action Sequences In Salaar-సలార్‌లో కూడా శృతి మించడం ఖాయం..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ కేవలం అందాల ఆరబోతకే పరిమితం కాకుండా యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.

ఆమె పాత్ర కోసం ప్రత్యేకంగా ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను దర్శకుడు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.ఇటీవల శృతి హాసన్ నటించిన క్రాక్ చిత్రంలో కూడా ఆమె ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపించింది.

ఆ సినిమాకు ఆమె యాక్షన్ సీక్వెన్స్ బాగా కలిసిరావడంతో, ఇప్పుడు సలార్ చిత్రంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవ్వబోతున్నారు.

దీంతో సలార్ చిత్రంలో ప్రభాస్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లలో రెచ్చిపోయేందుకు శృతి హాసన్ రెడీ అవుతోంది.

ఇక ఈ సినిమా కథలో శృతి హాసన్ పాత్ర చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని, అందుకే ఆమెతో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను చేయించేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర కూడా అల్టిమేట్‌గా ఉండనుండటంతో సలార్ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

##Salaar #Prashant Neel #Shruti Hassan #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు