టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ( Shruti haasan )గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవలే ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య,( Waltair Veerayya ) వీర సింహారెడ్డి లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇద్దరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాల తర్వాత ఈ ముద్దుగుమ్మకు మరిన్ని అవకాశాలు వస్తాయని అభిమానులు భావించారు.

కానీ ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ లు అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం ఎటువంటి సినిమాలు లేవు.సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.తరచూ తనకు తన బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడంతో పాటు అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ లైవ్ చాట్ కూడా నిర్వహిస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటోంది.
తన చెల్లెలు అక్షర, ప్రియుడు శాంతను హజారికా( shantanu hajarika )తో కలిసి ఫన్నీ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా తన ప్రియుడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
కాగా ప్రస్తుతం ఈమె తన ప్రియుడితో కలిసి ముంబైలో ఉంటున్న విషయం తెలిసిందే.

తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్లతో క్విజ్ నిర్వహించింది.ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అడిగిన విషయాలకు క్రేజీ ఆన్సర్స్ ఇచ్చింది ఈ బ్యూటీ.మీరిద్దరిలో ఎవరు బాగా వండుతారు ? అని ప్రశ్నించగా.నేను బాగు వంట చేస్తాను అంటూ రిప్లై ఇచ్చింది.అలాగే.ఎక్కువగా ఎవరు తింటారు? అని అడగ్గా.శాంతను అంటూ చెప్పేసింది.
ఇక మీ ప్రియుడిలో నచ్చే లక్షణాలు ఏంటీ? అని ప్రశ్నించగా.తన ప్రియుడిపై ప్రశంసలు కురిపించింది శాంతను.
అతను ఎంతో తెలివైనవాడు అని.తనను బాగా నవ్విస్తాడని.కాస్త వింతగా కూడా ప్రవర్తిస్తాడని.అన్నింటికంటే ముఖ్యమైనది తనను ఎక్కువగా ఇష్టపడతాడని చెప్పుకొచ్చింది శృతి హాసన్.అతని కళ్లు అంటే చాలా ఇష్టమని తన ప్రేమను వ్యక్తం చేసింది.అలాగే మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా సారీ చెబుతుంటారని అడగ్గా.
ఎప్పుడైనా సరే తాను సారీ చెప్పాల్సిందేనని తెలిపింది.







