ఎయిర్ పోర్ట్ ఘటనపై స్పందించిన శృతిహాసన్... ఆ వ్యక్తి ఎవరంటే?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శృతిహాసన్ ( Shruthi Haasan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె కెరియర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ సాధించారు.

 Shruti Haasan Opens Up On Airport Incident, Shruthi Haasan, Prabhas, Salaar, Mum-TeluguStop.com

ఇకపోతే ముంబై ఎయిర్ పోర్ట్ లో శృతిహాసన్ వెంట గుర్తు తెలియని వ్యక్తి ఆమెను ఫాలో చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే తాజాగా ఈ ఘటనపై శృతిహాసన్ స్పందించారు.

Telugu Salaar, Mumbai Air Port, Prabhas, Scary, Shruthi Haasan-Movie

ఈ సందర్భంగా శృతిహాసన్ సోషల్ మీడియా వేదిక( Social Media )గా అభిమానులతో ముచ్చటిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.ఒక నెటిజన్ ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా అంటూ ప్రశ్నించడంతో ఈమె ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు.నాకు సాధారణంగా బాడీగార్డ్స్ పెట్టుకోవడం అలవాటు లేదు.నా స్వేచ్ఛకు భంగం కలగకూడదన్న ఉద్దేశంతో నేను బాడీగార్డ్స్ ని పెట్టుకోనని అయితే ఇప్పుడు పెట్టుకోవాల్సిన సమయం కూడా వచ్చిందనిపిస్తుంది అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.

Telugu Salaar, Mumbai Air Port, Prabhas, Scary, Shruthi Haasan-Movie

ఎయిర్ పోర్టు( Mumbai Airport )లోకి నన్ను వెంబడించిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు.ఆ వ్యక్తి నన్ను ఫాలో అవుతూ ఉండగా ఫోటో కోసమే వస్తున్నారని అనుకున్నాను కానీ ఫోటోగ్రాఫర్ ఆమె పక్కకి వెళ్లి నిల్చోమని చెప్పినపుడు.అతను మరి క్లోజ్గా వచ్చాడు.అలా ఆయన పక్కనకు రావడంతో నాకు చాలా అసౌకర్యంగా అనిపించి అక్కడి నుంచి వెళ్లిపోయానని ఈ సందర్భంగా ఈ ఘటనపై శృతిహాసన్ స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్( Salaar ) సినిమాలో నటించారు.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube