యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శృతి హాసన్.( Shruti Haasan ) ఈ అమ్మడు ఇండస్ట్రీ లో చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా వచ్చిన గుర్తింపు చాలా ఎక్కువ.
హిందీ, తెలుగు మరియు తమిళ భాష ల్లో సినిమా లు చేసిన ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్ ను సొంతం చేసుకుంది.ఒక వైపు సలార్( Salaar ) వంటి బిగ్గెస్ట్ మూవీ లో నటిస్తూ మరో వైపు నాని తో హాయ్ నాన్న( Hi Nanna ) అనే మీడియం రేంజ్ సినిమా లో ఐటం సాంగ్ చేసింది.
ఇలా శృతి హాసన్ తన ఇమేజ్ ను ఇలాంటి పాత్రలకే అన్నట్లుగా పరిమితం అవ్వకుండా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను సద్వినియోగం చేసుకునే ఉద్దేశ్యంతో ఈ అమ్మడు సినిమాలు చేస్తూ వస్తోంది.తాజాగా శృతి హాసన్ చేసిన సినిమా లో ఆమె పాత్ర మరీ తక్కువ ఉంది.
అయినా కూడా ఆమె ఎందుకు ఇలాంటి పాత్రలు ఎందుకు ఒప్పుకుంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
పారితోషికం ( Remuneration ) డిమాండ్ చేస్తే ఎంత అయినా కూడా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.దాంతో శృతి హాసన్ సినిమా, పాత్ర లను పట్టించుకోకుండా సినిమాలు చేస్తోంది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.యూనివర్శిల్ స్టార్ కూతురు అనే ఇమేజ్ ను ఎప్పుడో పక్కన పెట్టిన శృతి హాసన్ కాస్త జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకోవడం మంచిది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో శృతి హాసన్ ఎంపిక చేసుకుంటున్న సినిమాలు మరియు పాత్రల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.ముందు ముందు అయినా శృతి హాసన్ కాస్త మంచి పాత్రలు మరియు పెద్ద సినిమాలకు కమిట్ అవ్వాలని కొందరు సూచిస్తున్నారు.మరి శృతి హాసన్ ఎలాంటి సినిమాలకు ఓకే చెబుతుందో చూడాలి.