శ్రీరెడ్డి అనే ఈ పేరు వింటే చాలు ఫైర్ బాంబు అని అనేస్తారు జనాలు.గతంలో ఈమె ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి తెలిసిందే.
ఏదో ఒక విషయంతో రచ్చ చేసే ఈ హాట్ బ్యూటీ క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తల దూర్చి హాట్ టాపిక్ గా మారింది.ఇక ఈమె మాట్లాడే మాటలు వింటే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.
ఈమె సోషల్ మీడియాలో మాత్రం మరింత యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం ఏదో ఒక పోస్టును వైరల్ గా మారుస్తుంది.
ఇక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పంపిస్తూ నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తుంది.ఇక ఈ మధ్య రాజకీయాలకు చెందిన వారిని కూడా అస్సలు వదలట్లేదు.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పట్ల చేసే విమర్శలు అంతా ఇంతా కాదు.
ఈమెకు టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా బాగా రెచ్చిపోతుంది.
అందులో ఆమె పంచుకునే ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే.ఇక తాను వేసుకునే డ్రస్ లు మాత్రం తన అందాలను బయటపెడతాయి.
కేవలం తన ఫోటోలతో రచ్చ చేయడమే కాకుండా పలురకాల ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తుంది.అవి క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి.
వెండి తెరపై మెరవకున్న సోషల్ మీడియా ద్వారా ప్రతి రోజు ఏదో ఒక విషయం తో మెరుస్తూనే ఉంటుంది.ఇక సినిమాల్లో అవకాశాలు కూడా లేకపోవడంతో చెన్నై కి వెళ్లి అక్కడే సెటిల్ అయింది.
ఇదిలా ఉంటే ఇటీవలే ఈ హాట్ బ్యూటీ యూట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా షేర్ చేస్తూ వైరల్ గా మారుస్తుంది.ఇప్పటికీ చాలా వీడియోలు పంచుకోగా అవి నెటిజెన్లకు బాగా కనెక్ట్ అవుతుంటాయి.కొన్ని వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు మాత్రం బాగా పెలుతూ ఉంటాయి.ఇక ఈమధ్య శ్రీ రెడ్డిలో చాలా మార్పులు వచ్చాయి.పైగా రకరకాల వంటలు చేస్తూ కొన్ని నీతి సూక్తులు పంచుకుంటుంది.
కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి కూడా పంచుకుంటుంది.
ఇక యూట్యూబ్లో తను వంటలు చేస్తున్న వీడియోలను బాగా పంచుకుంటుంది.ముఖ్యంగా సీ ఫుడ్ లాంటివి తన అందాలను వడ్డిస్తూ షేర్ చేసుకుంటుంది.ఇక తాజాగా మరో వీడియోను తన యూట్యూబ్ వేదికగా పంచుకుంది శ్రీరెడ్డి.
అందులో బిర్యానీ వండుతూ కొన్ని నీతులు చెప్పింది.ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా.
అందులో తను పిల్లల పెంపకం గురించి కొన్ని విషయాలు మాట్లాడింది.చిన్నపిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుందని, చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లలను ఎక్కువగా ఒత్తిడి చేయవద్దని మంచి మాట తెలిపింది.
స్త్రీలు బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయం గురించి కూడా తెలిపింది.ఇక ఆమె చెప్పిన నీతులు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి.